మరోసారి నీలాంబరిగా మారుతున్న శివగామి  

Ramya Krishna Powerful Villain In Sai Dharam Tej Movie, Ramya Krishna, Sai Dharam Tej, Deva Katta, Sivagami, Tollywood News - Telugu Deva Katta, Ramya Krishna, Ramya Krishna Powerful Villain In Sai Dharam Tej Movie, Sai Dharam Tej, Sivagami, Tollywood News

టాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా తన సత్తా చాటిన రమ్యకృష్ణ, గతకొంత కాలంగా క్యారెక్టర్ పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది.ఈ క్రమంలో ఆమె కెరీర్‌లో గుర్తుండిపోయే పాత్రలను చేస్తూ ముందుకెళ్తోంది.

TeluguStop.com - Ramya Krishna Sai Dharam Tej Deva Katta

కాగా టాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ బాహుబలి చిత్రంలో రమ్యకృష్ణ చేసిన శివగామి పాత్ర ఆమెకు మరో టర్నింగ్ పాయింట్‌లా నిలిచింది.ఈ సినిమాలో ఆమె నటనకు ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు.

శివగామి పాత్రను రమ్యకృష్ణ కాకుండా వేరే ఎవరూ ఇంతబాగా చేయలేరేమో అనే స్థాయిలో రమ్యకృష్ణ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

TeluguStop.com - మరోసారి నీలాంబరిగా మారుతున్న శివగామి-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కాగా ప్రస్తుతం మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న ఓ సినిమాలో చాలా పవర్‌ఫుల్ పాత్రలో రమ్యకృష్ణ నటించనుంది.

గతంలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన నరసింహ చిత్రంలో నీలాంబరి పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో, అచ్చం అలాంటి పాత్రలో మరోసారి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రమ్యకృష్ణ రెడీ అవుతోంది.దర్శకుడు దేవా కట్టా తెరకెక్కి్స్తున్న ఈ పొలిటికల్ ఎంటర్‌టైనర్ మూవీలో రమ్యకృష్ణ ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తుందట.

అయితే ఇది విలన్ పాత్ర కావడంతో చాలా పవర్‌ఫుల్‌గా చూపించేందుకు దేవా కట్టా అండ్ టీమ్ రెడీ అవుతున్నారు.

గతంలో దేవా కట్టా తెరకెక్కించిన ప్రస్థానం చిత్రంలో డైలాగ్ కింగ్ సాయి కుమార్ పాత్రను ఇది పోలి ఉంటుందని చిత్ర వర్గాల టాక్.

దీంతో మరోసారి నీలాంబరి స్థాయి పాత్ర రమ్యకృష్ణకు పడిందని, ఈ పాత్రలో రమ్యకృష్ణ మరోసారి తన విశ్వరూపాన్ని చూపించడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది.మరి ఈ సినిమాలో సీఎం పాత్రలో రమ్యకృష్ణ ప్రేక్షకులను ఎంతమేర మెప్పిస్తుందో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

ఇక ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా ప్రారంభించాలని తేజు అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నారు.

#Deva Katta #Ramya Krishna #Sai Dharam Tej #RamyaKrishna #Sivagami

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ramya Krishna Sai Dharam Tej Deva Katta Related Telugu News,Photos/Pics,Images..