పూరీ సినిమాలో శివగామి చేసేది ఏ పాత్ర..?

టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ఫైటర్ ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.కాగా ఈ డైరెక్టర్ నిర్మాతగా మారి తన కొడుకుతో రొమాంటిక్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

 Ramya Krishna Role In Romantic Movie, Ramya Krishna, Liquor Bottles, Puri Jagann-TeluguStop.com

ఈ సినిమాతో ఆకాష్ పూరీ ఎలాగైనా సక్సెస్ కొట్టాలని చూస్తున్నాడు.అయితే పూరీ ఈ సినిమాకు కథను అందిస్తుండటంతో పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా వస్తుందని చిత్ర పోస్టర్స్ చూస్తే తెలుస్తోంది.

కాగా ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో నటిస్తుందని చిత్ర యూనిట్ తెలిపింది.అయితే ఈ సినిమాలో రమ్యకృష్ణ చేసేది ఎలాంటి పాత్ర అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

కాగా ఈ సినిమాలో ఆమె చేయబోయేది విలన్ పాత్రనా లేక హీరో తల్లి పాత్రా అనేది చాలా క్యూరియాసిటీని పెంచింది.అయితే రమ్యకృష్ణ ఈ సినిమాలో హీరో తల్లి పాత్రలోనే నటిస్తుందని తెలుస్తోంది.

ఈ సినిమాలో ఆకాష్ పూరీ యాక్షన్ ప్రేక్షకులను ఖచ్చితంగా మెప్పిస్తుందని చిత్ర యూనిట్ అంటోంది.

అటు ఈ సినిమాలో ఆకాష్ పూరీ సరసన కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోండగా, అనిల్ పాదూరి అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.

ఈ సినిమాను పూరీ కనెక్ట్ బ్యానర్‌పై పూరీ-ఛార్మీ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.మరి ఈ సినిమాలో రమ్యకృష్ణ ఎలాంటి పాత్రలో మనకు కనిపిస్తుందో, ఆమె పాత్రకు ఎలాంటి ప్రాముఖ్యత ఉందో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube