ఆ విషయంలో రమ్యకృష్ణ రేంజ్ హీరోయిన్ల కన్నా ఎక్కువే అంట.? రోజుకి ఎంత అంటే.?       2018-06-23   22:35:32  IST  Raghu V

బాహుబలిలో శివగామిగా ఏ ముహూర్తంలో ఆఫర్ వచ్చిందో కానీ రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ ఓ రేంజ్ లో సాగుతున్నాయి. మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ టాలీవుడ్ లో ఇప్పుడు తనే. హీరోయిన్ గా అగ్ర స్థానాన్ని కొన్నేళ్ల పాటు చవిచూసిన రమ్యకృష్ణ ప్రస్తుతం చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు. ప్రత్యేకించి ‘బాహుబలి’ సినిమాతో ర‌మ్య‌కృష్ణ‌ ఇమేజ్ రెట్టింపు అయ్యింది. రమ్యకు క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్టారడ‌మ్ రెట్టింపు అయ్యింది. ఈ నేపథ్యంలో ఈమె పారితోషకం కూడా భారీ స్థాయికి చేరుకుందని వినికిడి.

టాలీవుడ్‌లో అత్త, అమ్మ పాత్రలు చేసే మాజీ హీరోయిన్లకు మంచి డిమాండ్ ఉంది. ఈ తరహా పాత్రలు చేసే వాళ్లు స్టార్లుగా వెలుగొందుతున్నారు. వీరిలో కూడా రమ్య మరింత ముందున్నారు. అందుకు తగ్గట్టుగా పారితోషకం కూడా తీసుకుంటోందట రమ్య. అత్యధికంగా రోజుకు 6 లక్షల దాకా ఛార్జ్ చేస్తుందట శివగామి. షూటింగ్ కోసం ఎన్ని కాల్ షీట్స్ కావాలంటే అన్ని ఆరు లక్షలు మల్టి ప్లై చేసుకోవాలన్న మాట.

ఇప్పుడు లీడింగ్ హీరోయిన్లు కోటి రూపాయల స్థాయి పారితోషకం తీసుకుంటుంటే, రమ్య అంతకు మించి పొందుతోందని టాక్. ఒక సినిమాలో రమ్య ఫుల్‌లెంగ్త్ పాత్ర చేసిందంటే.. ఇరవై రోజుల డేట్స్ అయినా అవసరం అవుతాయి. ఒక్కోసారి అంతకు మించి కూడా అవసరం కావొచ్చు. ఇలా చూస్తే రమ్య ఏదైనా ప్రాధాన్యత ఉన్న పాత్రను చేస్తే.. ఆ సినిమాకు రెమ్యూనరేషన్‌గా కోటి రూపాయల పై మొత్తాన్నే అందుకునే అవకాశం ఉంది. రమ్య టైటిల్ రోల్‌లో చేస్తున్న ‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమాకు ఈ స్థాయి పారితోషకం అందుకుందని కూడా ప్రచారం జరుగుతోంది.