పూరి కుమారుడి చిత్రంలో కీ రోల్ చేయనున్న రమ్య  

Ramya Krishna Playing Key Role In Akash Puri Movie-ramya Krishna,romantic Love,tollywood Ramya Krishna

పూరి జగన్నాధ్ నిర్మాణం లో పూరి కుమారుడు ఆకాష్ పూరి,కేతికా శర్మ హీరో,హీరోయిన్స్ గా ‘రొమాంటిక్’ అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.అయితే ఈ చిత్రంలో బాహుబలి చిత్రంలో శివగామి పాత్రలో మరోసారి వెండితెర ను అదరగొట్టిన ఒకప్పటి హీరోయిన్ రమ్య కృష్ణ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తుంది.

Ramya Krishna Playing Key Role In Akash Puri Movie-ramya Krishna,romantic Love,tollywood Ramya Krishna-Ramya Krishna Playing Key Role In Akash Puri Movie-Ramya Romantic Love Tollywood

Ramya Krishna Playing Key Role In Akash Puri Movie-ramya Krishna,romantic Love,tollywood Ramya Krishna-Ramya Krishna Playing Key Role In Akash Puri Movie-Ramya Romantic Love Tollywood

సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా తిరిగి మరలా కెరీర్ ప్రారంభించిన రమ్య కు బాహుబలి చిత్రం మంచి బ్రేక్ ఇచ్చింది.దీనితో ప్రస్తుతం సపోర్టింగ్ క్యారెక్టర్స్ తో నటిస్తూ ఫుల్ బిజీ అయిపొయింది.ఈ క్రమంలోనే పూరి నిర్మాణ సారధ్యంలో వస్తున్న రొమాంటిక్ చిత్రంలో రమ్య కు కీలక పాత్ర ఉండనున్నట్లు తెలుస్తుంది.

ఈ చిత్రంలో ర‌మ్య‌కృష్ణ సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా చేస్తున్నప్పటికీ కూడా ఫుల్ లెంగ్త్ రోల్ ఉండనున్నట్లు సమాచారం.ఈ చిత్రంలో ఆమె పాత్ర అత్యంత కీలకం అన్నట్లు తెలుస్తుంది.నేటి నుండి హైద‌రాబాద్‌లో జ‌ర‌గ‌నున్న షెడ్యూల్‌లో టీంతో జాయిన్ కానుంది.

పూరీ జ‌గ‌న్నాథ్ నిర్మాణంలో ఆకాశ్ పూరి, కేతికా శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న రొమాంటిక్ చిత్రానికి అనీల్ పాడూరి ద‌ర్శ‌క‌త్వం వహిస్తుండగా ఈ సినిమాలో బాలీవుడ్ నటులు మకరంద్ దేశ్ పాండే, మందిరాబేడీ లు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నట్లు తెలుస్తుంది.మరి ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్న రమ్య కు ఈ చిత్రం తన కెరీర్ కు మరింత ప్లస్ అవుతుందో లేదంటే మైనస్ అవుతుందో చూడాలి.