పవర్ ఫుల్ రోల్ లో బుల్లితెరపై సందడి చేయబోతున్న శివగామి

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీతో సమానంగా బుల్లితెరకి డిజిటల్ ఎంటర్టైన్మెంట్ కి డిమాండ్ ఉంది.ఓటీటీలో ప్రసారమయ్యే వెబ్ సిరీస్ లకి, అలాగే టీవీలలో ప్రసారమయ్యే సీరియల్స్ కి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.

 Ramya Krishna New Serial Naga Bhairavi, Tollywood, Zee Telugu, Naga Bhairavi, Tv-TeluguStop.com

యూత్ ఆడియన్స్ ఎక్కువగా వెబ్ సిరీస్ లపై ఆసక్తి చూపిస్తూ ఉంటే, ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా సీరియల్స్ పై శ్రద్ధ చూపిస్తున్నారు.ఫ్యామిలీ ఆడియన్స్ టేస్ట్ కి తగ్గట్లుగానే టీవీ చానల్స్ లో సీరియల్స్ ని సిద్ధం చేస్తున్నారు.

ఒకప్పటి మన తెలుగు సినిమాలలోని ఫ్యామిలీ కథలని తీసుకొని ఇప్పుడు సీరియల్స్ గా వండి వార్చేస్తున్నారు.ఆడియన్స్ కూడా వాటిని భాగానే ఆదరిస్తున్నారు.

ఎప్పటికప్పుడు చానల్స్ మధ్య పోటీ కారణంగా భారీ బడ్జెట్ తో పాటు, కొత్త సీరియల్స్ ని ప్రసారం చేస్తున్నారు.అలా ఇప్పుడు మరో కొత్త సీరియల్ తో బాహుబలి శివగామి జీతెలుగు చానల్ లో పవర్ ఫుల్ పాత్రలో సందడి చేయడానికి రెడీ అవుతుంది.

కోడి రామకృష్ణ చేసిన కథల తరహాలో పూర్తిగా గ్రాఫిక్స్ మాయాజాలంలో గతంలో బుల్లితెరపై నాగమ్మ, నాగ దేవత, నాగిని సీరియల్స్ సందడి చేశాయి.వీటికి మంచి రేటింగ్స్ కూడా వచ్చాయి.

టెలివిజన్ పై ఈ తరహా కథలకి మంచి క్రేజ్ ఉంది.ఈ నేపధ్యంలో రమ్యకృష్ణ పవర్ ఫుల్ పాత్రలో నాగ సంపద కాన్సెప్ట్ తో నాగ భైరవీ అనే సీరియల్ ప్రారంభమవుతుంది.

ఈ సీరియల్స్ కి సంబందించిన ప్రోమోని చానల్ తాజాగా రిలీజ్ చేసింది.ఇందులో మహా శివుడు విగ్రహం ముందు ఉన్న రమ్యకృష్ణతో నాగ సర్పం మాట్లాడుతూ ఉంటుంది.

తరతరాలుగా వస్తున్న నాగ సంపదను రమ్యకృష్ణ వంశం కాపాడుకుంటూ వస్తోందని అర్థమవుతోంది.రమ్యకృష్ణ తర్వాత ఆ వంశీకురాలు భైరవీ నాగసంపదను కాపాడుతుందా అనే కాన్సెప్ట్ లో నాగభైరవీ సీరియల్ కొనసాగుతుంది.

మరి ఈ సీరియల్ టెలివిజన్ ప్రేక్షకులని ఎంత వరకు అలరిస్తుంది అనేది వేచి చూడాలి.ఇక రమ్యకృష్ణ పాత్ర పూర్తి నిడివి ఉన్నదేనా లేక గెస్ట్ అపీరియన్స్ అనేది సీరియల్ ప్రారంభం తరువాత క్లారిటీ వస్తుంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube