అమ్మ బయోపిక్‌ రెండవ పార్ట్‌కు అంతా సిద్దం

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌లు అంటూ ప్రస్తుతం తమిళంలో పలు సినిమాలు వస్తున్నాయి.అందులో ప్రముఖంగా రెండు సినిమాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

 Queen Second Seasion Start After Completion Of Lock Down, Ramya Krishna, Jayalal-TeluguStop.com

ఒకటి కంగనా నటిస్తున్న తలైవి కాగా రెండవది నిత్యామీనన్‌ నటిస్తున్న ఐరెన్‌ లేడీ.ఈ రెండు సినిమాలు జయలలిత జీవితాన్ని ఆవిష్కరిస్తామంటూ చెబుతున్నాయి.

ఇదే సమయంలో వెబ్‌ సిరీస్‌ రూపంలో క్వీన్‌ గా రమ్యకృష్ణ జయలలిత బయోపిక్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.

Telugu Iran Lady, Jayalalitha, Kangana Ranauth, Nitya Menon, Ramya Krishna, Tami

ఎంఎక్స్‌ ప్లేయర్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన క్వీన్‌ మొదటి సీజన్‌కు మంచి రెస్పాన్స్‌ రావడంతో అంతా కూడా ఇప్పుడు రెండవ సీజన్‌ కోసం ఎదురు చూస్తున్నారు.మొదటి సీజన్‌ను చాలా ఎమోషనల్‌గా తెరకెక్కించిన మేకర్స్‌ రెండవ సీజన్‌లో జయలలితకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను రహస్యాలను చూపించబోతున్నట్లుగా తమిళ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

రెండవ సీజన్‌లో కూడా రమ్యకృష్ణ టైటిల్‌ రోల్‌లో నటించబోతుందట.

ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి అవ్వగా రెండవ సీజన్‌కు సంబంధించిన షూటింగ్‌ను ఈ లాక్‌ డౌన్‌ ఎత్తివేసిన వెంటనే ప్రారంభించే అవకాశం ఉందని అంటున్నారు.గత డిసెంబర్‌లో మొదటి సీజన్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కనుక రెండవ సీజన్‌ను అంతకు ముందే విడుదల చేయాలని నిర్మాత గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ భావిస్తున్నాడు.క్వీన్‌కు వచ్చిన రెస్పాన్స్‌తో రెండవ సీజన్‌ను మరింత రిచ్‌గా తెరకెక్కించబోతున్నారట.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube