జూనియర్ ఎన్టీఆర్ కి అత్తగా సీనియర్ హీరోయిన్…  

Ramya Krishna Is Playing Important Role In Ntr And Trivikram Movie - Telugu Jr Ntr, Ramya Krshinan, Telugu Vetaran Actress, Tollywood, Trivikram

ప్రస్తుతం టాలీవుడ్ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నటువంటి ఓ చిత్రంలో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా చిత్ర యూనిట్ సభ్యులు చేశారు.

 Ramya Krishna Is Playing Important Role In Ntr And Trivikram Movie

ఇందులో భాగంగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేస్తున్నట్లు కూడా తెలిపారు.అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త తెగ హల్ చల్ చేస్తోంది.

అయితే ఇంతకీ ఆ వార్త ఏంటంటే అప్పట్లో నా అల్లుడు చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ అత్త పాత్రలో నటించినటువంటి రమ్యకృష్ణ ఈ సారి మళ్లీ త్రివిక్రమ్ సినిమాలో అదే పాత్ర పోషించనున్నట్లు సమాచారం.కాగా పాత్ర ఏదైనా సరే తనదైన శైలిలో ఆకట్టుకుంటూ ఆ పాత్రకు వంద శాతం న్యాయం చేసేటువంటి రమ్యకృష్ణ కచ్చితంగా ప్రేక్షకులను మెప్పిస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ కి అత్తగా సీనియర్ హీరోయిన్…-Latest News-Telugu Tollywood Photo Image

కాగా ఈ చిత్రానికి సంబంధించి న టైటిల్ ఈ విషయంలో కూడా పలు కథనాలు వినిపిస్తున్నాయి.ఇందులో ముఖ్యంగా ఇప్పటికే “అయిననూ హస్తినకు పోయి రావలే…” అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు టాలీవుడ్ సినీ వర్గాలు బలంగా చర్చించుకుంటున్నాయి.

కాగా ఈ చిత్రాన్ని ప్రకటించి దాదాపుగా రెండు నెలల సమయం కావొస్తున్నప్పటికే చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం టైటిల్ పై స్పష్టత ఇవ్వడంలేదు.దీంతో యంగ్ టైగర్ అభిమానులు కొంతమేర నిరాశకు గురవుతున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నటువంటి ఆర్ఆర్ఆర్ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి పలు కీలక సన్నివేశాల చిత్రీకరణ కూడా పూర్తయినట్లు సమాచారం.

దీంతో తొందర్లోనే త్రివిక్రమ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ల కొత్త సినిమా పనులు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test