రాఘవేంద్రరావు లేకుంటే అప్పట్లోనే పెళ్లి చేసుకునేదాన్ని.. రమ్యకృష్ణ భావోద్వేగ వ్యాఖ్యలు..

హీరోయిన్ రమ్యకృష్ణ ‘బాహుబలి’ చిత్రం ద్వారా రాజమాత శివగామిదేవిగా దేశవ్యాప్తంగా బాగా పాపులర్ అయింది.అయితే, ఇప్పుడు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్న రమ్యకృష్ణ ఒకప్పుడు స్టార్ హీరోయిన్.

 Ramya Krishna Emotional About Raghavendra Rao And Her Marriage-TeluguStop.com

కాగా ఒకానొక దశంలో ఆమె కెరీర్ ఇక ముగిసిపోయిందని అందరూ అనుకున్నారు.ఆ సమయంలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు చిత్రంలో ఓ పాత్ర పోషించి మళ్లీ హీరోయిన్‌గా దూసుకుపోయిందట.ఇంతకీ ఆ చిత్రం ఏంటి? అసలేం జరిగిందంటే.

1980లలోనే కథనాయికగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయిన రమ్యకృష్ణ ‘అల్లుడు గారు’ చిత్రం చేయడానికి ముందర చాలా ఇబ్బుందుల్లో ఉందట.ఆ టైంలో ప్రొడ్యూసర్స్ రమ్యకృష్ణ అన్ లక్కీ ఆర్టిస్టు అని భావించి సినిమాలకు బుక్ చేసుకుని ఆ తర్వాత తీసేశారట.

 Ramya Krishna Emotional About Raghavendra Rao And Her Marriage-రాఘవేంద్రరావు లేకుంటే అప్పట్లోనే పెళ్లి చేసుకునేదాన్ని.. రమ్యకృష్ణ భావోద్వేగ వ్యాఖ్యలు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ నేపథ్యంలోనే దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ‘అల్లుడు గారు’ సినిమా చేశారు.ఆ టైంలో నిన్ను కాదన్న వాళ్లు మళ్లీ కావాలనుకునేట్లు చేస్తానని రాఘవేంద్రరావు మాటిచ్చారట.అలా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు దర్శకేంద్రుడు.ఆ చిత్రంలో మెయిన్ హీరోయిన్ కాకపోయినా మూగ అమ్మాయి పాత్ర పోషించినప్పటికీ ఆ పాత్ర ద్వారా రమ్యకృష్ణకు మంచి గుర్తింపు లభించింది.ఇక ఆ తర్వాత ఆమె హీరోయిన్‌గా బోలెడన్ని సినిమాలు చేసింది.

ఈ నేపథ్యంలో ఆనాటి సంగతులు గుర్తు చేసుకుని రమ్యకృష్ణ ఎమోషనల్ అయింది.రాఘవేంద్రరావు సినిమాలు లేకపోతే తాను సోదరి పాత్రలు చేసేదాన్నని, లేదా టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి లెఫ్ట్ అయి మ్యారేజ్ చేసుకునేదాన్నని చెప్పింది.

Telugu Alludu Garu Movie, Director K Raghavendra Rao, Pelli Sandad Movie, Ramya Krishna, Ramya Krishna Main Role, Ramya Krishna Marriage, Ramya Krishna Unlucky Artist, Republic Movie, Tollywood-Movie

హీరోయన్‌గా, స్టార్‌గా తనకు వచ్చిన గుర్తింపునకు క్రెడిట్ అంతా రాఘవేంద్రరావే అంటూ ‘సౌందర్యలహరి’ కార్యక్రమంలో తెలిపింది రమ్యకృష్ణ.రమ్యకృష్ణ ప్రజెంట్ పలు చిత్రాల్లో కీలక పాత్రల్లో నటిస్తోంది.ఆమె కీలక పాత్ర పోషించిన దేవకట్టా ‘రిపబ్లిక్’ సినిమా ఇటీవల విడుదలైంది.ఇకపోతే దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు వెండితెరపై యాక్టర్‌గా మెరవబోతున్నాడు.ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో, ఆయన నటిస్తున్న ‘పెళ్లి సందడి’ చిత్రం ఈ నెల 15న విడుదల అవుతోంది.

ఇందులో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరో కాగా శ్రీలీల హీరోయిన్.

#Raghavendra Rao #Pelli Sandad #Republic #Ramya Krishna #Ramya Krishna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు