రమ్యకృష్ణ : నేను సౌందర్యతో ఆ సినిమాలో అలా నటించాల్సింది కాదు.. కానీ  

Ramya Krishna emotional about Narasimha movie in Soundarya scene, Ramya Krishna, Soundarya, Tollywood veteran heroines, Narasimha movie scenes news, Tollywood, - Telugu Narasimha Movie Scenes News, Ramya Krishna, Ramya Krishna Emotional About Narasimha Movie In Soundarya Scene, Soundarya, Tollywood, Tollywood Veteran Heroines

తెలుగులో అప్పట్లో ప్రముఖ సీనియర్ దర్శకుడు కె.ఎస్ రవి కుమార్ దర్శకత్వం వహించిన “నరసింహ” అనే చిత్రం తెలుగు బాక్సాఫీస్ వద్ద ఎంత మంచి విజయాన్ని నమోదు  చేసిందో తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

TeluguStop.com - Ramya Krishna Emotional About Narasimha Movie In Soundarya Scene

అయితే ఇందులో తన  అద్భుతమైన నటన తీరుతో సీనియర్ హీరో సూపర్ స్టార్ రజనీకాంత్ మెప్పించగా హీరోయిన్ గా ప్రముఖ స్వర్గీయ నటి సౌందర్య ఎంతగానో అలరించింది.ఇక ఈ చిత్రంలో బాహుబలి చిత్ర ఫేమ్ శివగామి రమ్య కృష్ణ నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి పాత్రలో నటించి తెలుగు సినిమా పరిశ్రమకి లేడి విలన్ అంటే ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో తన నటనతో అదరగొట్టి చూపించింది.

అయితే తాజాగా రమ్యకృష్ణ ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయిన జీ తెలుగు లో ప్రసారమయ్యే “సరిగమప” అనే కార్యక్రమానికి హాజరయ్యింది. ఇందులో భాగంగా నరసింహ చిత్రంలో నటి రమ్యకృష్ణ మరియు సౌందర్య ఉన్న ఫోటోని చూపించగా కొంతమేర ఎమోషనల్ అయ్యింది.

TeluguStop.com - రమ్యకృష్ణ : నేను సౌందర్యతో ఆ సినిమాలో అలా నటించాల్సింది కాదు.. కానీ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

 అలాగే అప్పట్లో సౌందర్య తో ఆ సన్నివేశంలో నటించడం కొంతమేర బాధేసిందని కానీ సౌందర్య చాలా నటనా ప్రతిభ ఉన్నటువంటి ఆర్టిస్ట్ అంటూ పొగిడింది.అంతేగాక ఆమెకు తనతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అలాంటి నటి ని కోల్పోవడం చాలా బాదాకరమైన విషయం అంటూ అభిప్రాయం వ్యక్తం చేసింది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం రమ్య కృష్ణ తెలుగులో ప్రముఖ దర్శకుడు సుబ్బు దర్శకత్వం వహిస్తున్న “సోలో బ్రతుకే సో బెటర్” అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో రమ్యకృష్ణ ముఖ్య మంత్రి పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్నాయి.

#NarasimhaMovie #Ramya Krishna #RamyaKrishna #Soundarya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ramya Krishna Emotional About Narasimha Movie In Soundarya Scene Related Telugu News,Photos/Pics,Images..