కరోనా వ్యాక్సిన్ తీసుకున్న రమ్యకృష్ణ.. నెటిజన్లు ఏమన్నారంటే..?

పదిహేను సంవత్సరాల క్రితం స్టార్ హీరోయిన్ గా రమ్యకృష్ణ ఒక వెలుగు వెలిగారు.సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తున్న రమ్యకృష్ణ వరుస ఆఫర్లతో బిజీ అవుతున్నారు.

 Ramya Krishna Corona Vaccine  Photo Goes Viral In Social Media, Corona Vaccine,-TeluguStop.com

సినిమాలతో పాటు సీరియళ్లలో కూడా నటిస్తున్న రమ్యకృష్ణ రికార్డు స్థాయిలో పారితోషికం తీసుకుంటున్నారని తెలుస్తోంది.వయస్సు పెరుగుతున్నా అందంగానే కనిపిస్తున్న రమ్యకృష్ణ తాజాగా కరోనా వ్యాక్సిన్ ను తీసుకున్నారు.

రమ్యకృష్ణ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా వ్యాక్సిన్ తీసుకున్న ఫోటోను షేర్ చేశారు. బాహుబలి సిరీస్ సినిమాలలో శివగామి పాత్రలో అద్భుతంగా నటించిన రమ్యకృష్ణ ప్రస్తుతం బంగార్రాజు సినిమాతో పాటు రంగమార్తాండ సినిమాలలో కూడా నటిస్తున్నారు.

ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కే సినిమాలో కూడా రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నా ఈ మేరకు అధికారక ప్రకటన వెలువడాల్సి ఉంది.

మన కొరకు ఇతరుల కొరకు కరోనా వ్యాక్సిన్ తప్పనిసరిగా వేసుకోవాలని రమ్యకృష్ణ పోస్ట్ చేయగా నెటిజన్లు రమ్యకృష్ణ ఫోటో గురించి స్పందిస్తూ రమ్యకృష్ణ కరోనా వ్యాక్సిన్ తీసుకునే సమయంలో కూడా ఎంతో అందంగా ఉన్నారని కామెంట్లు పెడుతున్నారు.

మరొక నెటిజన్ రమ్యకృష్ణ మాస్క్ పెట్టుకోవడం వల్ల కేవలం కళ్లు మాత్రమే కనిపిస్తున్నాయని రమ్యకృష్ణ చూపులు తమ హృదయాలను గాయపరుస్తున్నాయని వెల్లడించారు.

Telugu Corona Vaccine, Ramyakrishna-Movie

వయస్సు పెరుగుతున్నా రమ్యకృష్ణకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గకపోవడం గమనార్హం.తెలుగుతో పాటు రమ్యకృష్ణకు ఇతర భాషల్లో కూడా సినిమా ఆఫర్లు వస్తున్నట్టు తెలుస్తోంది.నాగార్జున రమ్యకృష్ణ నటించిన సోగ్గాడే చిన్నినాయన బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో బంగార్రాజు సినిమాపై బాగానే అంచనాలు నెలకొన్నాయి.

వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube