రమ్య కృష్ణ బర్త్ డే.. సెలబ్రేషన్స్ లో ఒకప్పటి స్టార్ హీరోయిన్స్!

ఒకప్పటి స్టార్ హీరోయిన్ గా ఎన్నో కమర్షియల్ చిత్రాల్లో నటించి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా, దేవత పాత్రలలో, తల్లి, అక్క వదిన పాత్రలో ఎంతో అద్భుతంగా నటిస్తూ ఎంతో మంచి ప్రేక్షకాదరణ పొందిన రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ప్రస్తుతం రమ్య కృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మొదలు పెట్టి పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

 Ramya Krishna 51st Birthday Celebrations-trisha Khushbu-and Others Ramya Krishna-TeluguStop.com

ఈ క్రమంలోనే సెప్టెంబర్ 15 వ తేదీ ఈ శివగామి పుట్టిన రోజు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు.

ఈ క్రమంలోనే నాగార్జున సరసన రమ్యకృష్ణ బంగార్రాజు సినిమాలో నటిస్తున్నారు.

రమ్యకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి రమ్యకృష్ణకు శుభాకాంక్షలు చెబుతూ చిత్ర బృందం ఓ పోస్టర్ ను విడుదల చేశారు.ఈ పోస్టర్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది.

ఇకపోతే రమ్యకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా సీనియర్ హీరోయిన్స్ అందరూ కలిసి తన పుట్టినరోజు వేడుకలలో పాల్గొన్నారు.

సీనియర్ హీరోయిన్స్ అయినటువంటి రాధిక, ఖుష్బూ, లిజీ, మధుబాల, త్రిష, రెజీనాలతో పాటు కొందరు నటీనటులు, స్నేహితులు రమ్యకృష్ణ పుట్టిన రోజు వేడుకలో పాల్గొని ఎంతో ఘనంగా తన పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు.ప్రస్తుతం రమ్యకృష్ణ పుట్టిన రోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇక సినిమాల విషయానికి వస్తే రమ్యకృష్ణ ప్రస్తుతం రంగమార్తాండ, రిపబ్లిక్, బంగార్రాజు వంటి చిత్రాలతో బిజీగా ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube