బన్నీ ఇంకా ఎన్ని రికార్డులు కొడతాడు?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ అల వైకుంఠపురములో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు ఎగబడ్డారు.

 Ramulo Ramulaa Lyrical Song Sets New Record, Ramulo Ramulaa, Ala Vaikunthapuramu-TeluguStop.com

కాగా ఈ సినిమాను పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ తీర్చిదిద్దడంతో ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

కాగా ఈ సినిమాకు థమన్ తన కెరీర్ బెస్ట్ సంగీతాన్ని అందించడంతో ఈ సినిమా రిలీజ్‌కు ముందే సగం హిట్ అయ్యింది.

ఇక ఈ సినిమాలోని పాటు ఇప్పటికీ చార్ట్‌బస్టర్స్‌లో టాప్ ట్రెండింగ్‌లో ఉన్నాయి.ముఖ్యంగా సామజవరగమనా, రాములో రాములా, బుట్ట బోమ్మా పాటలు అన్ని ప్లాట్‌ఫాంలపై రచ్చ లేపుతున్నాయి.

కాగా రాములో రాములో సాంగ్ తాజాగా మరో అరుదైన రికార్డును క్రియేట్ చేసింది.ఈ పాటకు సంబంధించిన లిరికల్ సాంగ్ తాజాగా 200 మిలియన్ వ్యూస్‌ను దక్కించుకుంది.

/br>

గతంలోనే ఈ పాటకు సంబంధించిన వీడియో సాంగ్ 200 మిలియన్ వ్యూస్ దక్కించుకుని అదిరిపోయే రికార్డును క్రియేట్ చేసింది.ఇప్పుడు లిరికల్ సాంగ్ కూడా అదే ఫీట్‌ను సాధించడంతో ఒకే పాటకు చెందిన వీడియో, లిరికల్ సాంగ్‌లు ఇలాంటి హిట్ కొట్టడం సౌత్ ఇండియాలోనే తొలిసారిగా నిలిచింది.

మొత్తానికి బన్నీ ఈ సినిమాతో తన రికార్డుల వేటను ఏమాత్రం ఆపేలా కనిపించడం లేదు.ఇక ఈ సినిమాలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube