నిరుద్యోగ భృతి ప్రకటనపై రాములమ్మ సంచలన కామెంట్స్

ప్రభుత్వం ఇచ్చిన పలు కీలక హామీల్లో నిరుద్యోగ భృతి ఒకటి.మొదటి దఫా ప్రభుత్వంలో నిరుద్యోగ భృతి హామీని నిలబెట్టుకోకపోయినా ఈ దఫా ప్రభుత్వంలోనైనా ప్రభుత్వం అమలు చేస్తుందని నిరుద్యోగులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

 Ramulamma Sensational Comments On Unemployment Benefit Announcement, Vijayashant-TeluguStop.com

అయితే తాజాగా నిరుద్యోగ భృతిపై కేటీఆర్ పై అనధికారిక ప్రకటన చేసారు.త్వరలో తెలంగాణలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అందించనున్నామని కేటీఆర్ తెలిపారు.

ఈ ప్రకటనపై బీజేపీ ఫైర్ బ్రాండ్ తీవ్ర స్థాయిలో విమర్శించారు.నిరుద్యోగులకు ఇప్పటి వరకు ఒక్కొక్కరికి రూ.75 వేలు ఇవ్వాల్సి ఉందని, అవి ఇచ్చాక నిరుద్యోగ భృతిపై వ్యాఖ్యానిస్తే బాగుంటుందని రాములమ్మ విమర్శించారు.దుబ్బాక, జీహెచ్ఎంసీ ల ఓటమితో టీఆర్ఎస్ లో చలనం వచ్చిందని, ఇక వచ్చే నాగార్జున సాగర్, కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటమి రుచి చూపిస్తే మర్చిపోయిన హామీలన్నీ గుర్తుకు వస్తాయని రాములమ్మ విమర్శించారు.

బీజేపీ దెబ్బకు టీఆర్ఎస్ లో మార్పు వస్తున్నదని, ప్రజలు ఈ పరిణామంతో సంతోషపడుతున్నారని ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేవరకు టీఆర్ఎస్ ను బీజేపీ విడిచిపెట్టే ప్రసక్తి ఉండదని అన్నారు.ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం మెడలు వంచి ప్రజల తరపున పోరాడి, వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని రాములమ్మ అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube