ఇంకా ఎన్ని కామెడీ షోలు తెస్తారు రామోజీ గారు?

తెలుగు బుల్లి తెర అంటే ఒకప్పుడు ఈటీవీ గుర్తుకు వచ్చేది.తెలుగు లో వచ్చిన మొదటి శాటిలైట్‌ ఛాన్స్ లో ఈటీవీ ఒకటి అనడంలో సందేహం లేదు.ఒకప్పుడు సీరియల్స్ తో ఈటీవీ నెం.1 గా నిలిచింది.కాల క్రమేనా ఇతర ఛానెల్స్ వచ్చాయి.వాటితో పోటీ పడటంలో ఈటీవీ సీరియల్స్ వెనుక పడ్డాయి.పెద్ద ఎత్తున ఈటీవీ సీరియల్స్‌ వస్తున్నాయి.కాని వాటికి పెద్దగా రేటింగ్ వస్తున్నదే లేదు.

 Ramoji Rao Takes One More Comedy Show In Etv Plus-TeluguStop.com

ఈ సమయంలో ఈటీవీ మొత్తం కూడా కామెడీ షో మరియు ఢీ షో తో కొనసాగుతుంది.ఢీ షో ను కూడా ఈమద్య కాలంలో కామెడీ షో గా మార్చేశారు.

సుధీర్ మరియు ఆది ల కామెడీతో ఢీ కూడా కామెడీ షో మాదిరిగా మారి పోవడంతో చాలా మంది చూస్తున్నారు.ఇక కొత్తగా శ్రీదేవి డ్రామా కంపెనీ అంటూ కొత్త షో మొదలు అయ్యింది.

 Ramoji Rao Takes One More Comedy Show In Etv Plus-ఇంకా ఎన్ని కామెడీ షోలు తెస్తారు రామోజీ గారు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అది కూడా ప్రేక్షకులను ఎంటర్‌ టైన్‌ చేస్తుంది.పెద్ద ఎత్తున కామెడీ షో లు ఈటీవీని మంచి స్థానంలో నిలబెట్టడంతో ఈటీవీ ప్లస్ ఛానెల్‌ కూడా కామెడీ షో లపై ఆధారపడింది.

ఈటీవీ ప్లస్‌ లో గతంలో పటాస్ వచ్చేది.అది మంచి సక్సెస్ ను దక్కించుకుంది.ఇక కొత్తగా ఈటీవీ ప్లస్ లో రెచ్చిపోదాం బ్రదర్‌ అనే షో ప్రారంభం అయ్యింది.ఆ షో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ప్రోమోలతో రెచ్చి పోతుంది.

ప్రోమోలు ఆకట్టుకునే విధంగా ఉండటంతో పాటు ఇది మరో జబర్దస్త్‌ మరియు పటాస్ తరహాలో ఉంటుందనే నమ్మకంతో అంతా కూడా ఈ షో తో ఎంటర్‌ టైన్ అయ్యేందుకు సిద్దం అయ్యారు.

Telugu Etv Comedy Shows, Etv Shows, Film News, Hyper Aadi, Jabardasth Dhee, Pataas, Rajeev Kanakala, Ramoji Rao, Rechipodam Brother, Sudigali Sudheer-Movie

ఈనెల 7 నుండి ప్రారంభం అయిన రెచ్చి పోదాం బ్రదర్‌ కు ఒక మోస్తరుగా రేటింగ్‌ వస్తుంది.అయినా కూడా ముందు ముందు ఈ షో తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకంతో అంతా ఉన్నారు.మల్లెమాల వారు రూపొందిస్తున్న ఈ షో కు రాజీవ్‌ కనకాల జడ్జ్‌ గా వ్యవహరిస్తున్నాడు.

ఇలా ముందు ముందు ఈటీవీ వారు మరెన్ని కామెడీ షో లు తీసుకు వస్తాడో అంటూ ప్రేక్షకులు లెక్కలు వేసుకుంటున్నారు.

#Jabardasth Dhee #Pataas #Hyper Aadi #Rajeev Kanakala #Etv Shows

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు