ఓటీటీలోకి అడుగుపెడుతున్న మీడియా కింగ్ రామోజీ  

Ramoji Rao Plan to Start OTT Channel, Digital Entertainment, OTT, Tollywood, Eenadu Group - Telugu Digital Entertainment, Eenadu Group, Ott, Ramoji Rao Plan To Start Ott Channel, Tollywood

స్వర్గీయ ఎన్టీఆర్ హయాం నుంచి ఏపీ రాజకీయాలని సాశించిన మీడియా దిగ్గజం అంటే వెంటనే రామోజీరావు అని చెప్పేస్తారు.తెలుగు రాష్ట్రాలలో అతని పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు.

 Ramoji Rao Plan To Start Ott Channel

ప్రియా పచ్చళ్ళతో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి తరువాత ఈనాడు పత్రిక స్థాపించి మీడియా రంగంలో రారాజుగా ఎదిగిన రామోజీరావు అనతి కాలంలోనే రాజకీయాలని సైతం సాశించే స్థాయికి ఎదిగిపోయారు.ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ పెట్టడంలోని, ఆ పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్ళడంతో, తరువాత కాలంలో ఎన్టీఆర్ ని ముఖ్యమంత్రి స్థానం నుంచి గద్దె దించడంలో కూడా రామోజీ రాము కీలక భూమిక పోషించారని రాజకీయాలలో చెప్పుకుంటారు.

జర్నలిజంలో ప్రింట్ మీడియా నుంచి తెలుగులో ఎలక్ట్రానిక్ మీడియాకి కూడా ఆజ్యం పోషించిన వ్యక్తి రామోజీ.మీడియా రంగంలో మకుటం లేని మహారాజుగా ఎదిగిన రామోజీ తరువాత సినిమా రంగంలోకి కూడా అడుగుపెట్టి నిర్మాతగా సినిమాలు తీయడంతో పాటు, ఆసియాలోనే అతి పెద్ద స్టూడియో అయిన రామోజీ ఫిల్మ్ సిటీని స్థాపించి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.

ఓటీటీలోకి అడుగుపెడుతున్న మీడియా కింగ్ రామోజీ-General-Telugu-Telugu Tollywood Photo Image

రామోజీ ఫిల్మ్ సిటీలో హాలీవుడ్ సినిమాలు సైతం షూటింగ్ జరుపుకుంటాయి అంటే అతిశయోక్తి కాదు.సినిమాతో పాటు టెలివిజన్ రంగంలో సీరియల్స్ ద్వారా దూరదర్శన్ స్థానంలోకి ఈటీవీని తీసుకొచ్చి ఎంతో మంది కళాకారులకి సీరియల్స్ ద్వారా ఉపాధి కల్పించారు.

రామోజీ రావు వ్యాపార సామ్రాజ్యంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా కొన్ని లక్షల మంది ఉపాధి పొందుతున్నారు.ఇదిలా ఉంటే టీవీ, సినిమా, న్యూస్ మీడియా రంగంలో తన ప్రభావం చూపించిన రామోజీరావు ఎప్పటికప్పుడు ప్రపంచంలో వస్తున్నా అప్డేట్స్ కి తగ్గట్లు కొత్త వ్యాపారంలోకి అడుగు పెడుతూ వస్తున్నారు.

ఇప్పుడు సినిమా రంగంలో డిజిటల్ ఎంటర్టైన్మెంట్ హవా మొదలైంది, వెబ్ సిరీస్ లతో పాటు, కొత్త సినిమాల రిలీజ్ కి కూడా ఒటీటీ ప్లాట్ ఫామ్స్ వేదిక అయ్యాయి.ఇప్పుడు రామోజీ రావు కూడా ఈటీవీ నుంచి ఓటీటీ చానల్ ఏర్పాటుకి రంగం సిద్ధం చేస్తున్నారని తెలుస్తుంది.

ఇప్పటికే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా నుంచి డిజిటల్ మీడియా, వెబ్ మీడియాలోకి ఈటీవీ భారత్ ద్వారా అడుగుపెట్టిన రామోజీరావు ఎంటర్టైన్మెంట్ లోకి ఓటీటీ ద్వారా అడుగు పెడుతున్నట్లు సమాచారం.దీనికి సంబందించిన గ్రౌండ్ వర్క్ ఇప్పటికే మొదలైందని, త్వరలో అఫీషియల్ గా ఎనౌన్స్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.

#RamojiRao #OTT #Eenadu Group

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ramoji Rao Plan To Start Ott Channel Related Telugu News,Photos/Pics,Images..