సురేష్‌ బాబు తప్పుకున్నా రామోజీ పట్టుదలగా ఉన్నాడట

తెలుగు సినిమా పరిశ్రమను రాష్ట్రం విడిపోయిన సమయంలో చంద్రబాబు నాయుడు ఏపీకి తీసుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేశాడు.పూర్తిగా కాకున్నా కనీసం పాక్షికంగా అయినా ఏపీకి తీసుకు వెళ్లి అక్కడ మెల్ల మెల్లగా షూటింగ్‌ లు చేయించి.

 Ramoji Rao Going To Start Ramoji Film City In Vishakapatnam-TeluguStop.com

స్టూడియోలు ఏర్పాటు చేయించి ముందు ముందు అక్కడ కూడా ఇండస్ట్రీ ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు ఆశ పడ్డాడు.కాని ఆయన సీఎంగా దిగి పోయిన తర్వాత సీఎం జగన్ నుండి ఆ విధంగా ప్రయత్నాలు జరగలేదు.

ఆయన సినిమా పరిశ్రమకు వ్యతిరేకంగా కూడా లేడు.కాని ఆయన ఇతర కార్యక్రమాలతో బిజీగా ఉండటం వల్ల సినిమా పరిశ్రమ గురించి పట్టించుకునేందుకు ఆసక్తి చూపించలేదు అనేది ఒక వాదన.

 Ramoji Rao Going To Start Ramoji Film City In Vishakapatnam-సురేష్‌ బాబు తప్పుకున్నా రామోజీ పట్టుదలగా ఉన్నాడట-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ విషయం గురించి పక్కకు పెడితే వైజాగ్‌ లో సురేష్‌ బాబు తన స్టూడియోను వెనక్కు తీసుకుంటున్నారు అంటూ ఇటీవలే వార్తలు వచ్చాయి.

తాజాగా సురేష్‌ బాబు తన స్టూడియో ఆలోచనను విరమించుకోవడం వల్ల రామోజీరావు రంగంలోకి దిగబోతున్నారనే వార్తలు వస్తున్నాయి.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకార రామోజీ రావు వైజాగ్‌ లో మినీ రామోజీ ఫిల్మ్‌ సిటీని ఏర్పాటు చేయబోతున్నాడట.పర్యాటకంగానే కాకుండా షూటింగ్ లను కూడా చేయబోతున్నట్లుగా చెబుతున్నారు.

ఈనాడును మొదట వైజాగ్‌ లోనే రామోజీ రావు ప్రారంభించారు.అక్కడ ఆయనకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది.

కనుక ఈ విషయంలో మరే ఆలోచన లేకుండా వైజాగ్ లో రామోజీ ఫిల్మ్ సిటీని ఏర్పాటు చేసేందుకు సిద్దం అవుతున్నారు.

Telugu Andhra Pradesh, Chandra Babu Jagan, Film News, Mini Ramoji Film City, Ramanaidu Studios, Ramoji Film City, Ramoji Rao, Suresh Productions, Tollywood-Movie

వైజాగ్‌ లో రామోజీ ఫిల్మ్‌ సిటీకి ఏపీ ప్రభుత్వం నుండి కూడా గ్రీన్ సిగ్నల్‌ దక్కే అవకాశాలు ఉన్నాయి.మొత్తానికి రామోజీ ఫిల్మ్‌ సిటీని వైజాగ్ తీసుకు వెళ్తున్నారు అనే వార్తలు సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.అయితే అంత దూరం షూటింగ్‌ లకు అది కూడా స్టూడియో కోసం షూటింగ్‌ కు వెళ్తారా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అక్కడ మొదలు పెట్టిన తర్వాత స్టూడియోను విస్తరించేలా రామోజీ ప్లాన్‌ చేస్తున్నారు.అంటే భారీ ఎత్తున మొదట ఏర్పాటు చేయబోవడం లేదు.

#Ramoji #Ramoji Rao #Ramoji #Andhra Pradesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు