నువ్వే కావాలి సినిమా చేసేందుకు రామోజీరావు పెట్టిన కండీషన్ ఏంటో తెలుసా?

Ramoji Rao Condition To Nuvve Kavali Movie Team

కొన్ని సినిమాలు విడుదల అయ్యే వరకు తెలియదు.అసలు ఇంత పెద్ద హిట్ అవుతాయని.

 Ramoji Rao Condition To Nuvve Kavali Movie Team-TeluguStop.com

అలాంటి సినిమాల్లో ఒకటి నువ్వే కావాలి.పెట్టిన బడ్జెట్ కు 16 రెట్లు లాభం సాధించి వారెవ్వా అనిపించింది.చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయం అందుకుంది.స్రవంతి రవికిశోర్ తీసిన ఈ సినిమా తెలుగులో రీమేక్ మూవీ.దీని అసలు మూవీ మలయాళంలో బ్లాక్ బస్టర్ సాధించిన నిరం.ఈ సినిమా మల్లూవుడ్ లో కనీవినీ ఎరుగని రీతిలో విజయం సాధించింది.

వెంటనే ఈ సినిమా హక్కులను ముత్యాల సుబ్బయ్య, భీమినేని శ్రీనివాసరావు తెలుగులో రీమేక్ హక్కుల కోసం ప్రయత్నించారు.కానీ.

 Ramoji Rao Condition To Nuvve Kavali Movie Team-నువ్వే కావాలి సినిమా చేసేందుకు రామోజీరావు పెట్టిన కండీషన్ ఏంటో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సాధారణంగా రెండు, మూడు లక్షల విలువ చేసే ఈ హక్కులు ఈ సినిమా విషయంలో ఓ రేంజిలో పెరిగిపోయాయి.రూ.70 లక్షలు ఇస్తేనే ఈ సినిమా తెలుగు హక్కులు ఇస్తామని అక్కడి ప్రొడ్యూసర్స్ వెల్లడించారు.దీంతో వద్దని ఊరుకున్నారు.

అయితే జేడీ చక్రవర్తి, నిరం దర్శకుడు మంచి మిత్రులు.ఈ పరిచయాన్ని ఆసరగా చేసుకున్న రవి కిశోర్.

జేడీ ద్వారా రైట్స్ కోసం ప్రయత్నించాడు.చివరకు 5 లక్షల రూపాయలకు ఓకే చెప్పాడు.

అయితే ముందుగా ఈ సినిమాను మహేష్ బాబుతో చేయాలి అనుకున్నారు.తనకు ఈ సినిమాకు సంబంధించిన సీడీని పంపించాడు.నెల రోజులు ఆయన రెస్పాన్స్ కోసం వెయిట్ చేశారు.కానీ తన నుంచి ఎలాంటి సమాచారం రాలేదు.

ఆ తర్వాత సుమంత్ తో సినిమా చేయాలి అనుకున్నారు.అయితే తను ఆ సమయంలో రెండు పెద్ద సినిమాలు చేస్తున్నాడు.

దీంతో తను చేయలేను అన్నాడు.ఆ తర్వాత కొత్త వారితో ఈ సినిమా చేయాలనుకున్నారు.

సినిమా బడ్జెట్ ఎంత అవుతుంది అని లెక్కలు వేశారు.చివరకు 75 లక్షలు అవుతుందని తేలింది.

అంత బడ్జెట్ తమతో కాదని భావించారు.అందుకే రామోజీరావు సహకారం కోరారు.

జీతంతో పాటు 20 శాతం లాభ ఇస్తామని రామోజీరావు చెప్పాడు.దీంతో స్రవంతి రవి కిశోర్ ఓకే చెప్పాడు.

Telugu Chakravarthy, Nuvve Kaavali, Nuvve Kavali, Ramojirao, Vijaya Bhaskar-Telugu Stop Exclusive Top Stories

ఓ టీవీ యాడ్ అబ్బాయి కనిపించాడు.చాలా క్యూట్ గా ఉన్నాడు.ఎవరు తను అని ఆరా తీశాడు కిశోర్.తను రోజారమణి కొడుకు అని తేలింది.వెంటనే తనని ఆడిషన్స్ కు పిలిచారు.అనారోగ్యంతో ఉన్నా ఆడిషన్స్ కు వచ్చి సెలెక్ట్ అయ్యాడు.

హీరోయిన్ గా రిచా ఓకే అయ్యింది.విజయ భాస్కర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

సినిమాకు చివరకు కోటి 15 లక్షలు ఖర్చు అయ్యింది.అక్టోబర్ 13, 2000 సంవత్సరంలో ఈ సినిమా విడదల అయ్యింది.

తొలి షో నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది.చివరకు 230 సెంటర్లలో 100 రోజులు ఆడింది.30 సెంటర్లలో 200 రోజులు ఆడింది.అన్ని చోట్లా కలిపి 18 కోట్ల రూపాయల షేర్ కలెక్ట్ చేసింది.

#Vijaya Bhaskar #Ramojirao #Nuvve Kaavali #RamojiRao #Chakravarthy

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube