రామోజీ రూటు మారిందా ..? టీడీపీతో చెడిందా ..?       2018-05-28   01:16:34  IST  Bhanu C

పచ్చళ్ళు అమ్ముకునే స్థాయి నుంచి పత్రిక పెట్టి రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగిన చెరుకూరి రామోజీరావు గురించి తెలుగురాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. ఎన్టీఆర్ హయం నుంచి ఆయన టీడీపీతో అంటకాగుతూనే ఉన్నారు. ఈనాడులో ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి అనుకూల కథనాలే వండి వారుస్తుంటారు. ఇంకా పచ్చిగా చెప్పాలంటే తెలుగుదేశం అంటే రామోజీ రామోజీ అంటే టీడీపీ అన్నట్టుగా వీరి బంధం పెనవేసుకుపోయింది. అయితే అదంతా ఒకప్పుడు .. ఇప్పుడు సీన్ మారిపోయింది. రాజకీయ సమీకరణాలూ మారిపోయాయి. టీడీపీని క్రమక్రంమంగా దూరం పెడుతున్నాడు రామోజీ. అందుకు ఆయన పత్రికలో వస్తున్న కథనాలే సాక్ష్యంగా కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలు టీడీపీ వర్గాలకు మింగుడుపడడంలేదు.

మొదటి నుంచి టీడీపీ అనుకూల పత్రికగా పేరున్న ఈనాడు`లో ఇప్పుడు అన్నీ న్యూట్రల్ లైన్ కథనాలు వస్తున్నాయి. ఒక్కసారిగా ఈనాడు తన స్టాండ్ మార్చుకుని ఉన్నదీ ఉన్నట్టు రాస్తుండడం మొదటి నుంచి ఆ పత్రిక చదువుతున్న పాఠకులతో పాటు టీడీపీ నాయకులకు ఆశ్చర్యం కలిగిస్తోంది. టీడీపీ కి కొంతలో కొంత ఉపశమనం ఏంటంటే ఆంధ్రజ్యోతి. నిస్సిగ్గుగా బాబు.. టీడీపీ భజనలోనే ఆ పత్రిక మనుగడ సాగిస్తోంది. అయితే ఈనాడు కి ఉన్నంత క్రెడిబులిటీ ఆ పత్రికకు లేదని బాబు అండ్ కో కు బాగా తెలుసు. గత ఎన్నికల్లో ఎంతమంది టీడీపీకి సపోర్ట్ చేసినా .. ఈనాడు కథనాలే బాబుని సీట్లో కూర్చోబెట్టాయి అనేది అందరికి తెలిసిన వాస్తవం. ఇప్పుడు రాజకీయ పరిస్థితులు కూడా మారిపోయాయి. అప్పుడు ఉన్న మిత్రులు అంతా టీడీపీకి వ్యతిరేకం అయ్యారు. ఈ దశలో ఏనాడూ కూడా బాబుని వదిలెయ్యడంతో ఆయనకు అయోమయం అరణ్యవాసం అన్నట్టు ఉంది పరిస్థితి.

ఒకపక్క ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు, మిత్రులందరూ దూరమైపోయారు. ఇక బద్ధశత్రువైన కాంగ్రెస్‌తో దోస్తీ ప్రచారాలు.. ఇవన్నీ బాబును ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. ఎన్నో సంక్లిష్ట సమయాల్లో చంద్రబాబుకు కొండంత అండగా నిలిచిన ఈనాడు మాత్రం ఇంకా న్యూట్రల్‌గా వ్యవహరిస్తుండటం బాబు కి మింగుడు పడడంలేదు.

ఈనాడు-టీడీపీ మధ్య గ్యాప్ పెరిగిందనే కంటే రామోజీ-చంద్రబాబు మధ్య దూరం ఎక్కువైందని ప్రచారం జోరందుకుంది.

అసలు రామోజీ రూటు మార్చడం వెనుక పెద్ద రాజకీయమే ఉన్నట్టు తెలుస్తోంది. ఆంధ్ర తెలీనంగానే విడిపోయాక ఆయనలో మార్పు మొదలయిందని ప్రచారం సాగుతోంది. రామోజీ ఆస్తులన్నీ తెలంగాణలోనే ఉన్నాయి. అందుకే తెలంగాణ ప్రభుత్వంతో కాస్త సన్నిహితంగా ఉంటున్నారనే విమర్శలున్నాయి.

దీనికి తోడు అప్పట్లోనే జగన్ రామోజీరావు ను కలిసి సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఆ పాత మిత్రుడు చంద్ర బాబు తో అసలు భేటీ మాటే లేదు. ఇక చంద్రబాబుకు అనుకూలంగా కూడా పత్రిక రాతలు రాయడం లేదు. పూర్తి న్యూట్రల్ గా ఉంటున్న `ఈనాడు` వైఖరి టీడీపీలో అంతర్మథనం మొదలైందట. రామోజీరావు తన మీడియాలో అనుకూలంగా రాస్తున్నది ఎవరికయ్యా అంటే అది మోడీకే. ఆయన ప్రధాని అయ్యాక రామోజీ రావుకు పద్మభూషణ్‌ కట్టబెట్టారు. స్వతహాగా బీజేపీ-టీడీపీతో రామోజీకి బంధం ఉంది. ఆ కృతజ్ఞతో ఏమోకానీ బీజేపీకి అనుకూలమైన కథనాలే ఆ మీడియాలో వస్తున్నాయి. ఇది బాబు లో మరింత అసహనాన్ని కలిగిస్తోంది.