రామ్ గోపాల్ వర్మ రిలీజ్ కాని సినిమాలు ఇవే!

రామ్ గోపాల్ వర్మ ఈ పేరు అంటేనే ఒక సెన్సేషన్ తెలుగు ఇండస్ట్రీలో కాంట్రవర్సి కేరాఫ్ అడ్రస్ గా ఆర్జివి ఉంటారు.తనకు నచ్చిన విషయాల గురించి ఎవరు ఎన్ని కామెంట్లు చేసినా వాటిని పట్టించుకోకుండా తనదైన శైలిలో వ్యవహరిస్తుంటారు.

 Ram Gopal Varma, Sridevi, Reddygarupoyaru, Pattapagalu, Sasikala, Disha Incident-TeluguStop.com

న్యూస్ లో ఏ విషయంఅయితే ఎక్కువగా సెన్సేషనల్ అయ్యి ఉంటుందో వాటిపై తరువాతి రోజే పోస్టర్ రిలీజ్ చేసి ఒక వారంలో ట్రైలర్ ని కూడా రిలీజ్ చేస్తాడు.ఇలా ఎన్నో సినిమాలు విడుదల కూడా నోచుకోకుండా ఉన్నాయి.

ఇలా అనౌన్స్ చేసి విడుదల కాకుండా ఉన్న ఆర్జివి సినిమాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

శ్రీదేవి: ఈ సినిమా మొదట్లో సావిత్రి అని పోస్టర్ రిలీజ్ చేసి తర్వాత శ్రీదేవి గా మార్చారు.అయితే ఈ చిత్రం మాత్రం విడుదల కాలేకపోయింది.

రెడ్డిగారు పోయారు: ప్రముఖ రాజకీయ నాయకుడైన రాజశేఖరరెడ్డి మరణాంతరం తర్వాత ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు రామ్ గోపాల్ వర్మ అనౌన్స్ చేశారు.తర్వాత ఈ సినిమా గురించి ఒక్క మాట కూడా ఆర్జివి మాట్లాడక పోవడం విశేషం.

పట్టపగలు: హర్రర్ చిత్రంగా నిర్మించబోయే ఈ సినిమాలో హీరో రాజశేఖర్ తో ట్రైలర్ కూడా రిలీజ్ చేసిన ఆర్జివి ఈ సినిమా కూడా కేవలం ట్రైలర్ మాత్రమే ఆగిపోయింది.

Telugu Brusly, Disha, Mogali Puvvu, Nayim, Pattapagalu, Ram Gopal Varma, Reddyga

శశికళ: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత శశికళ మీద చిత్రం నిర్మిస్తున్నట్లు ఆర్జివి ప్రచారం చేశారు.

నయీమ్: అనే ఒక పెద్ద గ్యాంగ్ స్టర్ జీవిత కథాంశంతో సినిమాను నిర్మించనునట్లు తెలిపారు.

మొగలి పువ్వు: సచిన్ జోషి హీరో గా ఒక రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాను కేవలం ట్రైలర్ మాత్రమే రిలీజ్ చేసి నిలిపివేశారు.

బ్రూస్ లీ: ఆర్జివి ఎంతో ఇష్టపడే వారిలో శ్రీదేవి తర్వాత బ్రూస్ లీ అని చెప్పవచ్చు.లేడీ బ్రూస్ లీ అనే టైటిల్ తో కేవలం ట్రైలర్ ని మాత్రమే విడుదల చేశారు.

ఇవే కాకుండా తాజాగా జరిగిన దిశ ఘటన ఆధారంగా చిత్రాన్ని తియ్యగా అది కూడా ఆగిపోయింది.మరి ఈ సినిమాలు అన్ని ఎప్పుడు విడుదల అవుతాయో చూడాలి!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube