సీనియర్ ఎన్టీఆర్ మీద కేసు పెట్టమంటున్న వర్మ ! ఏమైంది...?

ఏపీలో ఇప్పుడు ఎన్నికల సీజన్ మొదలవ్వడంతో….ప్రతి అంశాన్ని రాజకీయాల కోసం వాడేసుకునేందుకు రాజకీయ నాయకులు ప్రయత్నిస్తుంటారు.

 Ramgopal Varma Twit Againist To Tdp-TeluguStop.com

ఈ కోవలోనే నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో ‘ఎన్టీఆర్’ బయోపిక్ వస్తోంది.దీనికి కౌంటర్ గా అన్నట్టు… రాంగోపాల్ వర్మ కూడా … లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ… ఇంకో బయోపిక్ మొదలుపెట్టాడు.

ఇది ఇప్పుడు ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.రామ్ గోపాల్ వర్మ తన కొత్త చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నుండి ‘వెన్నుపోటు’ పాటను మొన్న రిలీజ్ చేయగా అది కాస్త టీడీపీ వర్గాల్లో కలకలం రేకెత్తించింది.

ఆ పాటలో వర్మ నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కించపరుస్తూ లిరిక్స్ ఉన్నాయని, అందులో ఏదో రాజకీయ కుట్ర దాగుందని పలువురు టీడీపీ నేతలు వర్మపై కేసులు పెట్టారు.దీనికి కౌంటర్ గా అన్నట్టు వర్మ తాను పాటలో చంద్రబాబును నేరుగా ఒక్క మాట కూడ అనలేదని, అలాంటి తనపై కేసులు పెడితే ఒకప్పుడు చంద్రబాబును నేరుగా తిట్టిన పెద్ద ఎన్టీఆర్ మీద ఎన్ని కేసులు పెట్టాలి అంటూ ఎన్టీఆర్ బాబును గురించి మాట్లాడుతున్న ఒక వీడియోని సైతం షేర్ చేశారు.ఇది ఇప్పుడు వైరల్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube