‘వెన్నుపోటు’ : వర్మ పై పోలీస్ కేసు…? General-telugu

వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ … ఇప్పుడు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా పేరుతో మరో వివాదానికి తెరలేపాడు. ఇందులో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్… ఆయన భార్య లక్ష్మి పార్వతి చంద్రబాబు నాయుడు కు సంబంధించిన స్టోరీ ని అల్లుతూ…వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ‘వెన్నుపోటు’ పాటను ఆయన నిన్న విడుదల చేశారు. కాగా, ఈ పాట ప్రస్తుతం పెద్ద దుమారం రేపుతోంది. రామ్ గోపాల్ వర్మ విడుదల చేసిన పాట ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబును అవమానించేలా ఉందని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 Ramgopal Varma Target To Telugu Desam Party-TeluguStop.com

అందుకే… దర్శకుడు వర్మతో పాటు నటీనటులు, ఈ సినిమాకు పనిచేసిన ఇతర నిపుణులపై ఏపీ అంతటా కేసులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషయమై టీడీపీ నేత ఎస్వీ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వెన్నుపోటు పాటలో చంద్రబాబును అనుచితంగా చూపారని మండిపడ్డారు. చంద్రబాబు ఫొటోలను వాడుకుని ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించారని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే పరువు నష్టం కేసులతో పాటు … క్రిమినల్ కేసులు పెట్టేందుకు టీడీపీ నాయకులు సిద్ధం అవుతున్నట్టు పార్టీలో చర్చ జరుగుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter