అతడిని పెళ్లి చేసుకుంటానంటున్న రామ్‌ గోపాల్‌ వర్మ

రామ్‌ గోపాల్‌ వర్మ ఏం చేసినా సంచలనమే అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఆయన ట్వీట్స్‌ చాలా విడ్డూరంగా వింతగా ఉంటాయి.

 I Want To Marry This Editor Says In Ram Gopal Varma  Ramgopal Varma, Narendra Mo-TeluguStop.com

వర్మ తాజాగా సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నాడు.కరోనా వైరస్‌పై పాటను క్రియేట్‌ చేయడంతో పాటు స్వయంగా పాడి అందరి దృష్టిని ఆకర్షించాడు.

ఇటీవల తాను కరోనా సినిమాను తెరకెక్కించబోతున్నాను, స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి అయ్యిందన్నాడు.ఇక కేటీఆర్‌తో సరదాగా ట్వీట్స్‌ చేయడం ప్రభుత్వాలపై కామెంట్స్‌ చేయడం వర్మకు వచ్చిన నచ్చిన పని.తాజాగా ఒక వీడియోను పోస్ట్‌ చేశాడు.ఆ వీడియో వైరల్‌ అవుతోంది.

రజినీకాంత్‌ హీరోగా నటించిన దళపతి సినిమాలోని సింగారాల పైరులోనా బంగారాలే పండేనంట అనే పాట తమిళ వర్షన్‌ను మోడీ ఇంకా ట్రంప్‌లకు అన్వయించి వారి లిప్‌ మూమెంట్‌ ఇంకా బాడీలాంగ్వేజ్‌ను సింక్‌ చేసి ఎవరో ఎడిట్‌ చేయడం జరిగింది.అది చాలా బాగా సెట్‌ అయ్యింది.

ఆ ఎడిటింగ్‌ నచ్చిన వర్మ ఇది ఎడిట్‌ చేసింది ఎవరో కాని నాకు అతడిని పెళ్లి చేసుకోవాలని ఉంది అంటూ కామెంట్‌ చేశాడు. అతడు ఎవరో అన్నట్లుగా వర్మ ట్వీట్‌ చేశాడు.

రామ్‌ గోపాల్‌ వర్మ ఇలాంటి ట్వీట్స్‌ను జెనరల్‌గా చేస్తూనే ఉంటాడు.అతడి ట్వీట్స్‌ చాలా వరకు నవ్వు తెప్పించే విధంగా ఉంటున్నాయి.వర్మ ఇలాంటి వైరల్‌ వీడియోలు పోస్ట్‌ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉన్నాడు.ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రంప్‌, మోడీలు స్టార్స్‌ కనుక వారి ఫొటోలు, వీడియోలను ఇలా ఎంతో మంది ఎడిట్‌ చేస్తున్నారు.

అందులో ఒకటి అయిన ఈ వీడియో వర్మకు బాగా నచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube