భార్య చేత చెంపదెబ్బ తిన్న రామ్‌ గోపాల్‌ వర్మ

రామ్‌ గోపాల్‌ వర్మ ఏ విషయంను అయినా నిర్మొహమాటంగా, ధైర్యంగా అనేస్తాడు.ఆయన మొండిగా ఏ విషయంపై అయినా ముందుకు వెళ్లగల ధైర్యం ఉన్న వ్యక్తి.

 Ramgopal Varma Commentson Hiswife-TeluguStop.com

అలాంటి వ్యక్తికి భార్య, కుటుంబం, పిల్లలు అంటే అసలు బాధ్యత ఉండదు.పెళ్లి అనే బంధాన్ని తాను నమ్మను అంటాడు.

పెళ్లి వల్ల సమస్యలు మొదలవుతాయంటూ తాజాగా మరో ఇంటర్వ్యూలో రామ్‌ గోపాల్‌ వర్మ చెప్పుకొచ్చాడు.ఆ ఇంటర్వ్యూలో తన భార్య గురించిన కొన్ని విషయాలను చెప్పుకొచ్చాడు.

భార్య చేత చెంపదెబ్బ తిన్న రామ�

నా భార్యకు నేను శ్రీదేవికి ఫ్యాన్‌ను అనే విషయం ముందే తెలుసు.అయితే అప్పుడు ఆమెకు ఎలాంటి ఇబ్బంది లేదు.కాని నేను ఎప్పుడైతే శ్రీదేవితో సినిమాలు చేసి క్లోజ్‌ అయ్యానో అప్పుడు నా భార్యకు అనుమానం రావడం మొదలైంది.ఇది అభిమానించడం వరకే ఉంటుందా మరెక్కడికైనా దారి తీస్తుందా అంటూ ఆమె అనుమానపడేది.

పదే పదే నా ముందు శ్రీదేవితో అక్రమ సంబంధం ఉన్నట్లుగా అనుమానిస్తూ మాట్లాడేది.ఒకరోజు రాత్రి సమయంలో శ్రీదేవి మా ఇంటికి కాల్‌ చేసింది.ఆ సమయంలో నేను ఇంట్లో లేకపోవడంతో నా భార్య ఫోన్‌ లిఫ్ట్‌ చేసి మాట్లాడింది.

నేను ఇంటికి వెళ్లిన తర్వాత శ్రీదేవి ఫోన్‌ చేసిన విషయాన్ని చెప్పి మెల్లగా గొడవ స్టార్ట్‌ చేసింది.

శ్రీదేవితో అక్రమ సంబంధం వరకు తీసుకు వెళ్లింది.అప్పుడే నేను నేను ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకుంటే నాతో గొడవ పడి శారీరకంగా ఆమెతో కలవకుండా చేయగలవేమో, అదే నీలో ఆమెను చూసుకుంటూ నీతో ఉంటే అప్పుడేం చేస్తావనగానే నా చెంపపై ఒక్కటి కొట్టింది.

ఆమెకు నేను మాట్లాడిన మాటలు నచ్చలేదు.నేను అన్నది నిజం అయినా ఆమె స్వీకరించి ఒక్క నిమిషం ఆలోచించలేక పోయిందని వర్మ చెప్పుకొచ్చాడు.

మా ఇద్దరి మద్య పెద్దగా సంతోషాలు ఏమీ లేవని వర్మ చెప్పుకొచ్చాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube