పవన్ ను దెయ్యమై పట్టుకుంటా అంటున్న వర్మ

రాంగోపాల్ వర్మకు వివాదాలేమి కొత్త కాదు.అసలు వివాదం కోసమే వర్మ కాచుకుని కూర్చుంటాడు అన్నట్టుగా ఆయన వ్యవహారశైలి ఉంటుంది.

 Ramgopal Varma Anasena Pawan Kalyan-TeluguStop.com

సినిమాల్లో తాను ఇచ్చే కౌంటర్లు ప్రత్యర్థులను ఎలా బయపెడతాయో, నిజ జీవితంలోనూ అదే స్థాయిలో కౌంటర్ లు ఇచ్చి వరం తానేంటో చెప్పకనే చెబుతుంటాడు.తాజాగా సోషల్ మీడియాలో వచ్చిన ఓ పోస్టింగ్ కి తనదైన శైలిలో వర్మ సమాధానం ఇచ్చాడు.

తన కర్మ కాండల పేరిట వెలసిన బ్యానర్‌కు కౌంటర్ ఇస్తూ ట్విట్ చేసాడు.వర్మ తాజాగా రూపొందించిన చిత్రం ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ వివాదాస్పదమైంది.

ఈ నేపథ్యంలో వర్మపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జనసేన యూత్‌ కోడూరుపేట పేరిట కొంతమంది వర్మకు శ్రద్ధాంజలి చెబుతూ బ్యానర్‌ ఏర్పాటు చేశారు.అందులో అసభ్య పదజాలం వాడుతూ ఈనెల 26న వర్మ పెద్దకర్మ చేస్తున్నామంటూ బ్యానర్‌లో పేర్కొన్నారు.దీనికి సంబంధించిన ఫొటోను ట్విటర్‌లో షేర్‌ చేసిన వర్మ.‘ మీ లీడరును దెయ్యమై పట్టుకోవడానికి అతి త్వరలో వస్తున్నా’ అంటూ వ్యంగ్యంగా ట్వీట్‌ పోస్ట్ చేశాడు.

పీకే, సీబీఎన్‌, లోకేశ్‌ మద్దతుదారులు నా వ్యతిరేకులు.అమ్మ రాజ్యంలో సినిమాను అర్థం చేసుకోండి.ఇది కేవలం వినోదం కోసం చేసినదే.నిజానికి నేను పీకే, సీబీఎన్‌, లోకేశ్‌ను ఎంతగానో ప్రేమిస్తాను.

వారి అనుచరులందరూ ముఖ్యంగా కోడూరుపాడు జనసేన కార్యకర్తలపై ఒట్టేసి ఈ విషయం చెబుతున్నా అంటూ తనదైన వెటకారపు శైలిలో పవన్ స్పందించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube