జనసేన అధినేత వీడియోపై కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ ట్వీట్..!

నూతన విద్యా విధానాన్ని అమలు చేసేందుకు కేంద్రం సిద్దమవుతోంది.ఈ నూతన విద్యా విధానంపై కేంద్ర మంత్రి మండలి బుధవారం చర్చించి ఆమోదం తెలిపింది.

 Central Minister Ramesh Pokhriyal, Janasena Leader Pawan Kalyan, Education Syste-TeluguStop.com

ప్రాథమిక విద్యా బోధన మాతృభాషలోనే సాగాలనే సిద్ధాంతో ఎన్ఈపీ-2020ను కేంద్రం ప్రతిపాదించింది.ఈ నూతన విధానాన్ని స్వాగతిస్తున్నట్టు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

విద్యార్థులకు ఒకేషనల్, చేతి వృత్తి, కళా సంబంధించి విద్యా విధానాల గురించి గతంలో తన ఆలోచనలను పవన్ కళ్యాణ్ వివరించారు.పవన్ కళ్యాణ్ మాట్లాడిన వీడియోపై తాజాగా కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ట్విట్టర్ లో స్పందించారు.

తాను చదుకునే సమయంలో తనకు ఏదైనా చేతి వృత్తుల కోర్సులు నేర్చుకోవాలని ఉండేదని కానీ కుదరలేదని అన్నారు పవన్ కళ్యాణ్.తనలాగే చాలా మంది విద్యార్థులకు చదువుతో పాటు ఒకేషనల్ కోర్సులు, చేతివృత్తి కోర్సులు చేయాలని ఉంటుందని.

దాని కోసం అలోచించి ప్రణాళికలు చేస్తున్నట్టు గతేడాది ఏప్రిల్ నెలలో పవన్ కళ్యాణ్ ఓ వీడియోలో పేర్కొన్నారు.ఈ వీడియోను ట్వీట్టర్ లో పోస్టు చేసిన కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్.

బహుముఖ విద్యా విధానం పట్ల పవన్ కళ్యాణ్ వెల్లడించిన అభిప్రాయాలను కేంద్రం నూతన విద్యా విధానం తుది ముసాయిదా రూపకల్పనలో పరిగణనలోకి తీసుకుందని స్పష్టం చేశారు.విద్యార్థులు తాము ఎంచుకున్న మార్గంలో పయనించేందుకు అనువైన సబ్జెక్టులు అందుబాటులోకి వస్తాయని రమేష్ పొఖ్రియాల్ వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube