ప్రభుత్వ అనుమతితోనే అక్కడ కోవిడ్-19 కేంద్రం ఏర్పాటు,క్లారిటీ ఇచ్చిన రమేష్ ఆసుపత్రి  

Vijayawada Ramesh hospital management speaks about the covid center fire accident incident, covid center fire accident , Vijayawada ,11killed - Telugu 11killed, Covid Center Fire Accident, Vijayawada, Vijayawada Ramesh Hospital Management Speaks About The Covid Center Fire Accident Incident

ఏపీ లోని విజయవాడ లో ఆదివారం తెల్లవారు జామున రమేష్ ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోవిడ్-19 సెంటర్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.విజయవాడలని స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌ ను రమేష్ ఆసుపత్రి యాజమాన్యం కరోనా చికిత్సా కేంద్రంగా వినియోగిస్తుండగా అక్కడ ప్రమాదం చోటుచేసుకుంది.

 Ramesh Hospital Management Fire Accident Incident

ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు.ఈ ఘటన సమయంలో 30 మంది రోగులు,10 మంది సిబ్బంది ఉండగా 11 మంది మృతి చెందడం తో మిగిలిన వారిని ఇతర ఆసుపత్రులకు తరలించి వైద్యం అందిస్తున్నారు.

అయితే రమేశ్ ఆసుపత్రి యాజమాన్యం స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌ను లీజుకు తీసుకుని కొవిడ్‌-19 కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు వార్తలు రావడం తో తాజాగా ఆ ఆసుపత్రి యాజమాన్యం దీనిపై స్పందించింది.ఏపీ సర్కార్ అనుమతితోనే అక్కడ కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నామని స్పష్టత ఇచ్చింది.

ప్రభుత్వ అనుమతితోనే అక్కడ కోవిడ్-19 కేంద్రం ఏర్పాటు,క్లారిటీ ఇచ్చిన రమేష్ ఆసుపత్రి-General-Telugu-Telugu Tollywood Photo Image

కరోనా రోగులకు చికిత్స అందించాలి అంటూ పలుమార్లు సర్కార్ నుంచి ఒత్తిడి రావడం తోనే ఎక్కువ మంది కొవిడ్‌-19 బాధితులకు వైద్యం అందించాలన్న ఉద్దేశంతో అక్కడ స్వర్ణ ప్యాలెస్ హోటల్‌ను కరోనా చికిత్సా కేంద్రంగా మార్చాల్సి వచ్చింది అని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది.హోటల్ నిర్వహణతో సంబంధం లేకుండా తాము రోగులకు వైద్య సేవలు అందించామని వివరించింది.

రోగులను చేర్చుకోవాలని భారీగా వినతులు వస్తుండడంతో అన్ని సౌకర్యాలున్న హోటల్లో సర్కారు అనుమతితో రోగులకు చికిత్స అందిస్తున్నామని తెలిపింది.ఆదివారం తెల్లవారు జామున షాట్ సర్క్యూట్ వల్లే అగ్నిప్రమాద చోటుచేసుకోవడం తో మొత్తం 11 మంది మృతి చెందగా మరికొందరు గాయపడ్డారు.

ఈ ఘటనలో గాయపడిన వారిలో ఇతర ఆసుపత్రులకు తరలించి వైద్యం అందిస్తున్నట్లు సమాచారం.

#11killed #Vijayawada #CovidCenter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ramesh Hospital Management Fire Accident Incident Related Telugu News,Photos/Pics,Images..