మహేష్ సాధించలేని రికార్డ్ ఆయన అన్న రమేష్ బాబు సాధించాడు.. ఏంటంటే..

సూపర్ స్టార్ మహేష్ బాబుకు సాధ్యం కానీ రికార్డ్ ఆయన అన్న రమేష్ బాబుకు సాధ్యం అయ్యిందట.ఏంటి నమ్మడం లేదా… అవును నిజమే మహేష్ బాబు కు సాధ్యం కానీ రికార్డ్ రమేష్ బాబు సాధ్యం చేసి చూపించాడు.

 Ramesh Babu Holds The Record That Mahesh Could Not,  Mahesh Babu, Ramesh Babu,-TeluguStop.com

టాలీవుడ్ లో సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా రమేష్ బాబు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు.కానీ ఆయన హీరోగా మాత్రం సక్సెస్ అవ్వలేక పోయాడు.

ఆ తర్వాత కృష్ణ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు మాత్రం సూపర్ స్టార్ గా ఎదిగి తన తండ్రికి తగ్గ కొడుకుగా పేరు తెచ్చుకున్నాడు.రమేష్ బాబు గత రెండు రోజుల క్రితం మరణించిన విషయం తెలిసిందే.

అయితే రమేష్ బాబు హీరోగా రాణించక పోయినప్పటికీ తమ్ముడు మహేష్ బాబు కంటే ఒక విషయంలో మాత్రం ముందు ఉన్నాడు.మహేష్ కు సాధ్యం కానీ రికార్డ్ నెలకొల్పాడు రమేష్ బాబు.

Telugu Agni Pariksha, Balck Tiger, Devuduchesina, Krishna, Mahesh Babu, Mama Kod

గత కొంత కాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న రమేష్ బాబు జనవరి 8, 2022 న మరణించాడు.ఈయన మరణ వార్త సూపర్ స్టార్ అభిమానులను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది.రమేష్ బాబు భార్య పేరు మృదుల, కుమార్తె భారతి, కుమారుడు జయకృష్ణ ఉన్నారు.రమేష్ బాబు తండ్రి కృష్ణ సినిమాలో బాలనటుడిగా పరిచయం అయ్యాడు.

రమేష్ బాబు 5 ఏళ్ల వయసులోనే తండ్రి సూపర్ స్టార్ కృష్ణ స్థాపించిన పద్మాలయ స్టూడియోస్ తోలి సినిమా అగ్ని పరీక్ష సినిమాలో చిన్న నాటి కృష్ణ పాత్రలో బాల నటుడిగా పరిచయం అయ్యాడు.ఆ తర్వాత మోసగాళ్లకు మోసగాడు, దేవుడు చేసిన మనుషులు, అల్లూరి సీతారామరాజు, దేవదాసు, కురుక్షేత్రం, దొంగలకు దొంగ వంటి సినిమాల్లో బాల నటుడిగా నటించాడు.

Telugu Agni Pariksha, Balck Tiger, Devuduchesina, Krishna, Mahesh Babu, Mama Kod

దేవుడు చేసిన మనుషులు సినిమాలో చిన్ననాటి ఎన్టీఆర్ పాత్రలో నటించాడు.15 ఏళ్ల వయసులో ఈయన దాసరి తెరకెక్కించిన నీడ సినిమాలో ప్రధాన పాత్రలో నటించాడు.ఈ సినిమాతోనే మహేష్ బాబు కూడా బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు.ఈ సినిమా ఫంక్షన్ సమయంలో అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి చేతుల మీదుగా రమేష్ బాబు అవార్డు కూడా అందుకున్నారు.

Telugu Agni Pariksha, Balck Tiger, Devuduchesina, Krishna, Mahesh Babu, Mama Kod

ఫిలిం ఇండస్ట్రీలో తండ్రి కొడుకుల సరసన ఒకే హీరోయిన్ యాక్ట్ చేయడం అరుదు అనే చెప్పాలి.కృష్ణ, రమేష్ బాబు సరసన ఆరుగురు హీరోయిన్స్ నటించారు.సూపర్ స్టార్ కృష్ణ తో గూఢచారి 117 సినిమాలో నటించిన భానుప్రియ ఆయన కొడుకైన రమేష్ బాబు నటించిన బ్లాక్ టైగర్ లో కూడా నటించింది.గౌతమీ కూడా కృష్ణ సరసన అన్నా తమ్ముడు, డియర్ బ్రదర్ సినిమాల్లో నటించింది.

కొడుకు రమేష్ బాబు సరసన కృష్ణగారబ్బాయి, బజారు రౌడీ సినిమాల్లో నటించింది.

Telugu Agni Pariksha, Balck Tiger, Devuduchesina, Krishna, Mahesh Babu, Mama Kod

కృష్ణ రౌడీ అన్నయ్య వంటి సినిమాల్లో నటించిన రంభ రమేష్ బాబు సరసన పచ్చ తోరణం లో కూడా నటించింది.ఆమని కృష్ణ కు జోడీగా పచ్చని సంసారం లో నటించింది.ఆ తర్వాత అన్నా చెల్లెలు సినిమాలో రమేష్ బాబు జోడీగా నటించింది.

కృష్ణ సరసన రైతు భారతం లో నటించిన వాణీ విశ్వనాధ్ రమేష్ బాబు సరసన ఆయుధం, మామ కోడళ్ళు సినిమాల్లో నటించింది.రుచితా ప్రసాద్ కూడా కృష్ణ, రమేష్ బాబు ఇద్దరి సరసన నటించింది.

మహేష్ బాబు మాత్రం ఇలా కృష్ణ నటించిన హీరోయిన్ తో నటించలేదు.దీంతో మహేష్ కు దక్కని రికార్డ్, రమేష్ బాబు కు దక్కింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube