శర్వా పెళ్లి కోసం చరణ్‌ ఉపాసన సంప్రదింపులు

యంగ్‌ హీరో శర్వానంద్‌ త్వరలో పెళ్లి పీఠలు ఎక్కబోతున్నాడు.దాదాపు అయిదు సంవత్సరాలుగా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతున్నాడు.

 Ramcharan And Upasana Help The Love Between Sharwa Love, Ramcharan, Upasana, Sha-TeluguStop.com

ఇన్ని రోజులు అమ్మాయి ఎవరు ఏంటీ అనే విషయాలు ఎప్పుడు కూడా బయటకు రాలేదు.శర్వానంద్‌ తన ప్రేమ విషయాన్ని లో ప్రొఫైల్ లో ఉంచాడు.

అసలు ప్రేమిస్తున్న విషయం కూడా ఈమధ్య తెలిసింది.ఇక అమ్మాయి ఎవరు ఎలా ఉంటుంది అనే విషయంలో ఇంకా ఎలాంటి సమాచారం అయితే లేదు.

కాని ఆమె కామినేని వారి ఇంటి బంధువుల అమ్మాయి అంటూ సమాచారం అందుతోంది.

మెగా కాంపౌండ్‌ నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఉపాసనకు ఆమె కజిన్‌ అవుతుందని రామ్‌ చరణ్‌, ఉపాసనల ద్వారానే శర్వానంద్‌ కు ఆమె పరిచయం అయ్యిందని సమాచారం అందుతోంది.

రామ్‌ చరణ్‌, ఉపాసనల వివాహ వేడుకలో శర్వా ఆమెను కలిశాడని అంతకు ముందే కాస్త పరిచయం ఉన్నా పెళ్లితో ఇద్దరి మధ్య మంచి బంధం ఏర్పడింది.ఆ తర్వాత ఇద్దరు కూడా పార్టీలు పబ్‌ లు తిరుగుతూ స్నేహం ముదిరి ప్రేమగా మారిందని సమాచారం అందుతోంది.

Telugu Ramcharan, Sharwanandh, Srikram, Upasana-

ఇక వీరిద్దరి పెళ్లికి రామ్‌ చరణ్‌ మరియు ఉపాసనలు మధ్యవ్యర్తులుగా ఉండి మాట్లాడుతున్నట్లుగా తెలుస్తోంది.ఉపాసన మాటతో శర్వా ప్రేమించిన అమ్మాయి కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారని త్వరలోనే వీరికి ఎంగేజ్మెంట్‌ అంటూ ప్రచారం జరుగుతోంది.ఇక పెళ్లి వచ్చే ఏడాది ఉంటుందట.ప్రస్తుతం అమ్మాయి చదువు పూర్తి చేసి తమ కుటుంబ వ్యాపారాలు చూసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.ఇక హీరో శర్వానంద్‌ ప్రస్తుతం శ్రీకారం సినిమాతో పాటు మరో రెండు మూడు సినిమాలను లైన్‌ లో పెట్టాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube