ఆర్ఆర్ఆర్ టీమ్‌కు జీతం కట్  

No Salary To RRR Team, RRR, NTR, RamCharan, Rajamouli, DVV Danayya - Telugu Dvv Danayya, Ntr, Rajamouli, Ramcharan, Rrr

దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాతో రాజమౌళి మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తనదైన మార్క్ వేసుకునేందుకు రెడీ అవుతున్నాడు.

 Ramcharan Rajamouli Dvv Danayya

కాగా ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలుస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక ఈ సినిమాను డివివి దానయ్య అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు.

ఆర్ఆర్ఆర్ టీమ్‌కు జీతం కట్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కాగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా వాయిదా పడింది.దీంతో ఈ సినిమా బడ్జెట్ విషయంలో అంచనాలు తారుమారు అవుతున్నాయి.

అయితే ఇటీవల షూటింగ్ లేకపోవడంతో ఈ సినిమా యూనిట్‌కు సగం వేతనాన్ని నిర్మాత చెల్లించాడు.కానీ ఇప్పట్లో సినిమా మొదలయ్యే సూచనలు కనిపించకపోవడంతో ఈ నెల నుండి చిత్ర యూనిట్‌కు వేతనాలు చెల్లించలేనని చిత్ర నిర్మాత తెలిపాడు.

అయితే ఈ చిత్రానికి పనిచేసే అన్ని విభాగాలు ఈ నిర్ణయం వర్తిస్తుందా లేక ప్రత్యేకించి ఏదైనా విభాగానికి మాత్రమే వర్తిస్తుందా అనేది తెలియాల్సి ఉంది.ఇక ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా, చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు.

కాగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్, ఒలివియా మారిస్ ఈ సినిమాలో హీరోయిన్‌లుగా నటిస్తున్నారు.ఈ సినిమాను వచ్చే సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నాడు.

#DVV Danayya #Ramcharan #NTR #Rajamouli #RRR

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ramcharan Rajamouli Dvv Danayya Related Telugu News,Photos/Pics,Images..