పవన్ ఫోన్ కాల్ కోసం 'చెర్రీ' ఎదురుచూపు ! ఫోన్ వస్తే ఏం చేస్తాడో తెలుసా ...?  

  • మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఓ మీడియా ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన పర్సనల్ విషయాలు షేర్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా తన బాబాయి పవన్ కల్యాణ్ అడగాలే కానీ ఏం చేయడానికైనా తాను సిద్ధంగా ఉన్నాను అంటూ… చెప్పుకొచ్చాడు. ‘పవన్‌ బాబాయికి ఎలాంటి సహకారానికైనా తాను ముందుంటానని చెప్పారు.ఎందుకోసం అంటే ఆయన తన బాబాయి. ఆయన అడగాలే కానీ ఏదైనా చేస్తాం. ఆయనకు నచ్చని పని తాను ఎప్పుడూ చేయను అని తేజ చెప్పారు. పవన్ బాబాయి నుంచి ఒక్క ఫోన్‌కాల్‌ వస్తే చాలు మేమంతా పరిగెత్తుకుంటూ వెళ్లి చేస్తాం. ఆయన మాకు అంత దగ్గర’అని రామ్ చరణ్ తేజ అనడం ఇరువురు ఫ్యాన్స్ లో మంచి జోష్ నింపింది.

  • Ramcharan Is Waiting For Pavan Phone Call-

    Ramcharan Is Waiting For Pavan Phone Call

  • మొన్నటి వరకూ కాస్త గోప్యంగా వున్న మెగా ఫ్యామిలీ ఇప్పుడీ విషయంలో ఓపెన్ అయ్యింది. నాగబాబు ఎలాగో పవన్ కళ్యాణ్ నే సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. మొన్ననే వరుణ్ తేజ్ చేత కోటి రుపాయిలు విరాళం కూడా ఇప్పించారు. తాజాగా రామ్ చరణ్ ఓపెన్ అయ్యాడు. ఇక మిగిలింది మెగా స్టార్ మాత్రమే. ఇంతకీ రాంచరణ్ కి పవన్ ఫోన్ చేస్తాడా అనేది తెలియాలి.