మలయాళ సినిమా రైట్స్ సొంతం చేసుకున్న రామ్ చరణ్,ఇంతకీ తనకోసం కాదంట

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకపక్క నటుడిగా ఎంత బిజీగా ఉంటున్నాడో అలానే నిర్మాతగా కూడా బాగా బిజీ అయిపోయాడు.ఇప్పటికే తన సొంత నిర్మాణ బ్యానర్ అయినా కొణిదల ప్రొడక్షన్స్ మొదలు పెట్టిన తరువాత తోలి చిత్రం తండ్రి మెగాస్టార్ చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ అయిన ‘ఖైదీ నెం 150’ సినిమా తెరకెక్కించిన విషయం తెలిసిందే.

 Ramcharan Driving Licence Malayalam-TeluguStop.com

చిరు కమ్ బ్యాక్ మూవీ కావడం తో ప్రేక్షకులు కూడా భారీ స్థాయిలోనే ఆదరించారు.ఆ తరువాత ‘సైరా’ సినిమా , ఇప్పుడు కొరటాల మెగాస్టార్ చిరు కాంబినేషన్ లో వస్తున్న మరో చిత్రానికి కూడా రామ్ చరణ్ నిర్మాణ భాద్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.

అయితే మరోపక్క చెర్రీ కూడా రాజామౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్వ చిత్రం లో నటిస్తూ బిజీ గా ఉంటున్నాడు.అయితే ఇంత బిజీ గా ఉండి కూడా ఇప్పుడు తాజాగా మరో మలయాళ చిత్రం రైట్స్ ని రామ్ చరణ్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది.

అయితే గతంలో తండ్రి చిరు కోసం లూసిఫర్ చిత్ర రైట్స్ ను సొంతం చేసుకున్న చెర్రీ ఇప్పుడు తాజాగా ‘డ్రైవింగ్ లైసెన్స్’ అనే చిన్న చిత్రానికి సంబందించిన రీమేక్ రైట్స్ ను సొంతం చేసుకున్నట్లు సమాచారం.అయితే ఈ సినిమా తండ్రి కోసమో,లేదంటే తనకోసమో తీసుకోలేదట.

ఈ చిత్రంకి సంబంధించి రామ్ చరణ్ కేవలం నిర్మాణ భాద్యతలు మాత్రమే నిర్వర్తించనుండగా,హీరోగా మాత్రం వేరేవారిని చూడనున్నట్లు సమాచారం.

Telugu Licence, Jr Ntr, Malayalam, Rajamouli, Ramcharan-

‘డ్రైవింగ్ లైసెన్స్’ లాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాను చరణ్ రీమేక్ చేయడంతో నిర్మాతగా మరో మెట్టు పైకి ఎక్కడమే అని ఫిలిమ్ వర్గాలు తెగ అభినందిస్తున్నాయి.చరణ్ లాంటి హీరో చిన్న సినిమాలను ప్రోత్సహించడం పట్ల సినీ పెద్దలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారట.మరి చెర్రీ సొంతం చేసుకున్న ఈ మలయాళ రీమేక్ లో ఏ హీరో ని పెట్టి చిత్రాన్ని నిర్మాస్తాడో, ఈ వార్తల్లో ఎంతమేరకు నిజం ఉందొ అన్న విషయాలు తెలియాలి అంటే కొద్దీ రోజులు ఆగాల్సిందే మరి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube