మెగా 152లో రామ్‌ చరణ్‌ రెండు పాత్రలు

మెగాస్టార్‌ చిరంజీవి 152వ చిత్రం దసరా సందర్బంగా పూజా కార్యక్రమాలు జరుపుకుంది.కొరటాల శివ దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ వచ్చే నెల నుండి ప్రారంభం కాబోతుంది.

 Ramcharan Doingdouble Rolein Mega152th Movie-TeluguStop.com

చిరంజీవి ఈ చిత్రం కోసం చాలా ప్రత్యేకమైన గెటప్‌లో కనిపించబోతున్నాడు.బరువు కూడా తగ్గినట్లుగా తెలుస్తోంది.

భరత్‌ అనే నేను చిత్రం తర్వాత కొరటాల శివ చాలా గ్యాప్‌ తీసుకున్నాడు.ఇప్పటి వరకు చేసిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీ హిట్‌ రేంజ్‌లో సక్సెస్‌లను అందుకున్న కారణంగా కొరటాల దర్శకత్వంలో చేస్తున్న చిరు 152 చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి.

Telugu Chiranjeevi, Janasena, Koratala Siva, Pawan Kalyan, Ram Charan, Tollywood

పైగా సైరా చిత్రంతో ఇటీవల చిరంజీవి సూపర్‌ హిట్‌ను అందుకున్నాడు.అందుకే తప్పకుండా చిరు 152వ చిత్రం మంచి విజయాన్ని అందుకుంటుందని అంతా నమ్ముతున్నారు.చిరంజీవి మరియు రామ్‌ చరణ్‌ కలిసి వర్క్‌ చేస్తే అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి.ఖైదీ నెం.150 మరియు సైరా నరసింహారెడ్డి సినిమాలను రామ్‌ చరణ్‌ నిర్మించాడు.ఇక ఇప్పుడు కొరటాల దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాలను కూడా రామ్‌ చరణ్‌ నిర్మించబోతున్నాడు.

చరణ్‌ ఈ సినిమాకు కేవలం నిర్మాతగానే కాకుండా మరో పాత్రను కూడా పోషించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

Telugu Chiranjeevi, Janasena, Koratala Siva, Pawan Kalyan, Ram Charan, Tollywood

మెగాస్టార్‌ చిరంజీవి 152వ చిత్రంకు నిర్మాతగా మరియు ఒక నటుడిగా కూడా చరణ్‌ కనిపించబోతున్నాడు.నాన్న చిరంజీవితో కలిసి నటించాలని చరణ్‌కు మొదటి నుండి ఉంది.ఖైదీలో పాటలో రెండు స్టెప్పులు వేసిన చరణ్‌, సైరాలో నటించాలని ఆశపడ్డాడు.

కాని అది నెరవేరలేదు.ఇక కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్న సినిమాలో చరణ్‌ నటించబోతున్నాడు.

చరణ్‌ కోసం ఒక ప్రత్యేకమైన పాత్రను కూడా కొరటాల శివ క్రియేట్‌ చేశాడు.దాదాపు అర్థగంట పాటు మెగా 152లో చరణ్‌ కనిపించే అవకాశం ఉందని సినీ వర్గాల వారి అభిప్రాయం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube