‘ఆచార్య’లో అబ్బాయి ఉన్నాడా? లేడా?  

Ramcharan Act In Acharya Movie Or Not , Ramcharan, Acharya, Koratala Siva, Kajal Agarwal, Lock Down, Coronavirus, - Telugu Acharya, Coronavirus, Kajal Agarwal, Koratala Siva, Lock Down, Ramcharan

మెగాస్టార్‌ చిరంజీవి 152వ చిత్రం ఆచార్యలో రామ్‌ చరణ్‌ నటిస్తున్నాడు అనే విషయం అనధికారికంగా చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది.కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఆచార్య చిత్రం షూటింగ్‌లో చరణ్‌ పాల్గొనబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్న సమయంలో లాక్‌ డౌన్‌తో షూటింగ్‌ ఆగిపోయింది.

 Ramcharan Acharya

గత నాలుగు నెలలుగా ఆచార్య చిత్రం అటకెక్కింది.ఇప్పుడు ఆ చిత్రంలో చరణ్‌ ఉన్నాడా లేడా అంటూ మళ్లీ చర్చ జరుగుతోంది.

సినిమా షూటింగ్‌ ఆలస్యం అవుతున్న కారణంగా మరో వైపు ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం షూటింగ్‌ ఇంకా బ్యాలన్స్‌ ఉన్న కారణంగా ఆచార్య చిత్రం నుండి చరణ్‌ తప్పుకున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.ఒక వేళ చరణ్‌ ను ఆచార్యలో నటింపజేస్తే సినిమా మరో ఆరు నెలల ఆలస్యం అవ్వాల్సి వస్తుందట.

‘ఆచార్య’లో అబ్బాయి ఉన్నాడా లేడా-Movie-Telugu Tollywood Photo Image

అందుకే ఈసారికి చరణ్‌ లేకుండానే చిరంజీవి సినిమాను చేయాలని నిర్ణయించుకున్నాడు.అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.

చరణ్‌ నటించేందుకు ఒప్పుకున్న కారణంగా ఆ పాత్రను పెంచిన కొరటాల శివ ప్రస్తుతం మళ్లీ ఆ పాత్రను తగ్గించాలని భావిస్తున్నాడట.రామ్‌ చరణ్‌ను అనుకున్న పాత్రలో ఎవరిని తీసుకోవాలా అనే చర్చ జరుగుతోంది.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ను ఈ ఏడాది చివరి నుండి పున: ప్రారంభించబోతున్నారు.కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటించబోతుంది.

#Acharya #Koratala Siva #Kajal Agarwal #Coronavirus #Ramcharan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ramcharan Acharya Related Telugu News,Photos/Pics,Images..