ఎన్టీఆర్‌ సినిమాలో రంభ ఎంపిక తప్పుడు నిర్ణయం!       2018-05-16   01:43:03  IST  Raghu V

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో ఒక చిత్రం రూపొందుతున్న విషయం తెల్సిందే. జై లవకుశ వంటి బ్లాక్‌ బస్టర్‌ చిత్రంతో జోరుమీదున్న ఎన్టీఆర్‌, అజ్ఞాతవాసి ఫ్లాప్‌ వ్ల కసిమీదున్న త్రివిక్రమ్‌ ఈ చిత్రాన్ని చేయబోతున్న కారణంగా నందమూరి ఫ్యాన్స్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల్లో మరియు సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఆసక్తికి తగ్గట్లుగా, అంచనాలను అందుకునేలా దర్శకుడు త్రివిక్రమ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు పక్కా స్క్రిప్ట్‌ను సిద్దం చేశాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెల్సిందే. ఇక త్రివిక్రమ్‌ తన ప్రతి సినిమాలో సీనియర్‌ హీరోయిన్స్‌కు ఛాన్స్‌ ఇస్తున్నాడు.

అత్తారింటికి దారేది నుండి మొదు పెడితే మొన్నటి అజ్ఞాతవాసి వరకు తన సినిమాల్లో నిన్నటి తరం హీరోయిన్స్‌ను దర్శకుడు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాడు. ‘అజ్ఞాతవాసి’ చిత్రంలో ఖుష్బును చాలా పవర్‌ ఫుల్‌గా చూపించిన త్రివిక్రమ్‌ తాజాగా ఎన్టీఆర్‌తో తెరకెక్కించబోతున్న సినిమాలో రంభను కీలక పాత్ర కోసం ఎంపక చేయడం జరిగింది. గతంలో రంభ హీరోయిన్‌గా పలు చిత్రాల్లో నటించి స్టార్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అయ్యింది. ఈమద్య మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అయ్యింది. హీరో తల్లి పాత్రలో, హీరోయిన్‌కు సపోర్టింగ్‌ రోల్‌లో నటించేందుకు ఈమె ఆసక్తిని చూపుతుంది. త్రివిక్రమ్‌ కొత్తగా ఎవరినైనా తీసుకు రావాలని భావించాడు.

నిన్నటి తరం హీరోయిన్స్‌ను పలువరిని సంప్రదించిన తర్వాత తన సినిమాకు రంభ అయితే బాగా సెట్‌ అవుతుందనే ఉద్దేశ్యంతో త్రివిక్రమ్‌ ఆమెను ఎంపిక చేయడం జరిగింది. అయితే తల్లి పాత్రలో నటించాలి అన్నప్పుడు హుందాతనంతో ఉండాలి. అంటే అత్తారింటికి దారేదిలో నదియా పాత్ర తరహాలో, అజ్ఞాతవాసిలో ఖుష్బు తరహాలో సీరియస్‌గా, హుందాగా నటించినట్లయితేనే ఆ పాత్ర పండుతుంది. కాని రంభ మాత్రం మొదటి నుండి చలాకిగా, ఎక్కువ అల్లరి పాత్రలు పోషిస్తూ వస్తుంది. అలాంటి రంభ ఈ తరహా పాత్రను పోషించగలదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

రంభను ఈ చిత్రంలో సీరియస్‌ పాత్రలో త్రివిక్రమ్‌ చూపించే ప్రయత్నం చేస్తే అదో వృదా ప్రయాస అవుతుందని, రంభను అలా చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపించరు అంటూ కొందరు తెగేసి చెబుతున్నారు. కాని త్రివిక్రమ్‌ మాత్రం తనపై తనకున్న నమ్మకంతో రంభను ఎంచుకున్నాడు. ఎన్టీఆర్‌ కూడా దర్శకుడి నిర్ణయంకు మద్దతుగా నిలుస్తున్నాడు. ఈ చిత్రంను దసరా కానుకగా విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు. మే 20న ఎన్టీఆర్‌ బర్త్‌డేకు ఫస్ట్‌లుక్‌ రివీల్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రానికి ‘అసామాన్యుడు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.