ఇటీవల ఆదిపురుష్( Adipurush movie Team ) టీమ్ తిరుపతిని సందర్శించిన విషయం మనందరికీ తెలిసిందే.ఈ నేపథ్యంలోనే హీరోయిన్ కృతీ సనన్( kriti sanon ), దర్శకుడు ఓం రౌత్( Om Raut ) తిరుమలలో ముద్దు పెట్టుకోవటం తీవ్ర విమర్శల పాలవుతున్న సంగతి తెలిసిందే.
ఈ విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. హీరోయిన్ దర్శకుడు చేసిన పనికి మండిపడుతున్నారు.
దేవుడి సినిమాలో నటించి పుణ్య క్షేత్రంలో అశ్లీలంగా ప్రవర్తించటం ఏంటి? సిగ్గుగా లేదా అంటూ మంది పడుతున్నారు.అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.

ఇది ఇలా ఉంటే తాజాగా పాత రామయాణం సీరియల్లో సీత పాత్రలో నటించిన నటి దీపిక సీత పాత్రలో నటించిన కృతీ సనన్ తీరును తప్పుబట్టారు.ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ.ఇప్పుడున్న నటులతో ఇదే వచ్చిన చిక్కంతా.ఎవ్వరూ కూడా తమ పాత్రలోకి వెళ్లరు.దాని ఎమోషన్ ను అర్థం చేసుకోరు.కృతిసనన్, ఓం రౌత్‌కు ఆదిపురుష్ ఒక సినిమా మాత్రమే అయి ఉండవచ్చు.
కానీ కృతి సనన్ సీత పాత్రలో మనసు పెట్టి నటించడానికి చాలా కష్టపడి ఉండవచ్చు.కృతీ ఈ జనరేషన్ నటి.ఈ కాలంలో ఎవరినైనా హత్తుకోవటం, ముద్దు పెట్టుకోవటం మంచిగా పలకరించటం లాంటిది.

కానీ, పవిత్ర క్షేత్రంలో అలా చేయటం నిజంగా సిగ్గుచేటు.ఆమె తనను తాను సీత అని ఎప్పుడూ అనుకోదు.మా కాలంలో షూటింగ్ స్పాటులో కూడా మమ్మల్ని ఎవరూ మా పేర్లతో పిలవటానికి సాహసం చేసేవారు కాదు.
మేము దేవుళ్ల పాత్రలో ఉన్నపుడు సెట్‌లోని చాలా మంది మా పాదాలు తాకి వెళ్లేవారు.ఆ కాలం అంతా వేరు.ఆ కాలంలో ప్రేక్షకులు మమ్మల్ని కేవలం పాత్రలు మాత్రమే అనుకోలేదు.మమ్మల్ని నిజమైన దేవుళ్లుగానే భావించారు.
మేము ఎవ్వరినీ హత్తుకునే వాళ్లం కాదు.ముద్దు కూడా పెట్టనిచ్చేవాళ్లం కూడా కాదు.
ఆదిపురుష్ సినిమాలో చేసిన వారికి అది కేవలం సినిమానే కావచ్చు.కానీ, ప్రజల సెంటిమెంట్ లను గాయపర్చటం మంచిది కాదు అని ఆమె తెలిపింది.
