శరత్ బాబు మృతిపై పరోక్షంగా అలా చెప్పిన రమాప్రభ.. ఆ బాధ ఉంటుందంటూ?

ప్రముఖ టాలీవుడ్ నటీమణులలో ఒకరైన రమాప్రభ( Ramaprabha ) వయస్సు ప్రస్తుతం ప్రస్తుతం 76 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే.ఒక యూట్యూబ్ వీడియో ద్వారా రమాప్రభ షాకింగ్ విషయాలను )వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.

 Ramaprabha Shocking Comments About  Sharat Babu Death Details Here Goes Viral In-TeluguStop.com

ఈ మూడు నెలల్లో చిన్న టూర్లు వేశానని ఆమె తెలిపారు.హైదరాబాద్, విజయవాడ, తిరుపతితో పాటు షిరిడీ వెళ్లొచ్చానని రమాప్రభ చెప్పుకొచ్చారు.

Telugu Chennai, Rajinikanth, Ramaprabha, Sharat Babu, Tollywood-Movie

కొన్ని సంఘటనలు జరిగాయని ఒక్కోసారి జాలేస్తుందని ఒక్కోసారి నవ్వొస్తుందని ఒక్కోసారి బాధగా ఉంటుందని రమాప్రభ చెప్పుకొచ్చారు.ఈ మధ్య ఏదో ఒక విధంగా నేను పాపులర్ అవుతున్నానని ఒకటీ రెండు సంఘటనలు నా గురించే ఉన్నాయి కాబట్టి మాట్లాడాలని ఆమె కామెంట్లు చేశారు. చెన్నైలో నాకు ఒక ఇల్లు ఉందని ఆ ఇంట్లో చాలామంది ఉన్నారని రమాప్రభ చెప్పుకొచ్చారు.అందరూ అక్కడే ఉన్నా ఆ ఇల్లు నా ఇల్లు అని కాకుండా మరొకరి ఇల్లు అని చెబుతున్నారని రమాప్రభ కామెంట్లు చేశారు.

ఆ కామెంట్లు వింటే నాకు నవ్వొచ్చిందని ఆమె అన్నారు.నాకు రజనీకాంత్( Rajinikanth ) డబ్బులు ఇచ్చారని ప్రచారం జరుగుతోందని అయితే ఆ ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని రమాప్రభ అభిప్రాయం వ్యక్తం చేశారు.

నేను 13 సంవత్సరాల నుంచి సంపాదిస్తున్నానని ఆమె అన్నారు.

Telugu Chennai, Rajinikanth, Ramaprabha, Sharat Babu, Tollywood-Movie

ఇప్పుడు కొంతమంది నా గురించి నోటికొచ్చింది మాట్లాడుతూ సంపాదిస్తున్నారని ఆమె కామెంట్లు చేశారు.ఈ వీడియో చూసిన నెటిజన్లు శరత్ బాబు మరణం విషయంలో రమాప్రభ ఫీలవుతున్నారని ఆ బాధ తప్పకుండా ఉంటుందని అందుకే కామెంట్ చేశారని చెబుతున్నారు.శరత్ బాబు( Sharat babu )ను హీరోగా నిలబెట్టడం కోసం రమాప్రభ ఎంతో కష్టపడ్డారని నెటిజన్లు చెబుతున్నారు.

రమాప్రభ షేర్ చేసిన వీడియోకు భారీ స్థాయిలో లైక్స్ వచ్చాయి.రమాప్రభ అరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని కొంతమంది చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube