మాయమవుతున్న రామానాయుడు స్టూడియో  

Ramanaidu Studio To Be Shut Down - Telugu Daggubati Suresh, Ramanaidu Studio, Suresh Babu, Telugu Movie News, Venkatesh

తెలుగు సినీ ఇండస్ట్రీ అప్పట్లో మద్రాస్‌లో ఉండేదనే విషయం అందరికీ తెలిసిందే.కొంతకాలానికి అది హైదరాబాద్‌కు తరలి రావడంతో తెలుగు సినిమాలకు సంబంధించిన అన్ని పనులు ఇక్కడే జరగడం మొదలయ్యాయి.

Ramanaidu Studio To Be Shut Down - Telugu Daggubati Suresh, Ramanaidu Studio, Suresh Babu, Telugu Movie News, Venkatesh-General-Telugu-Telugu Tollywood Photo Image

అయితే అప్పట్లో నిర్మించిన పలు స్టూడియోలు ఇప్పటికీ తమ సేవలను అందిస్తూ సినిమా రంగాన్ని అభివృద్ధి చేశాయి.కాగా ఇందులో పేరొందిన రామానాయుడు స్టూడియో మరికొద్ది రోజుల్లో మాయం కానున్నది.

టాలీవుడ్ మొఘల్ రామానాయుడు ఏర్పాటు చేసిన రామానాయుడు ఫిలిం స్టూడియో హైదరాబాద్‌లో రెండు ఉన్నాయి.ఒకటి ఫిలింనగర్‌లో ఉండగా రెండోది నానక్‌రామ్‌గూడలో ఉంది.ఇందులో 100కు పైగా చిత్రాలను షూట్ చేశారు.గతకొంత కాలంగా ఈ స్టూడియో నిర్వహణ డి.సురేష్ బాబు చేస్తుండగా, ఇప్పుడు ఈ స్టూడియో స్థానంలో రియల్ ఎస్టేట్ బిజినెస్ జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

నానక్‌రామ్‌గూడలోని ఈ స్టూడియో ఉన్న స్థానంలో ప్లాట్లుగా మార్చి భవనాలు నిర్మించేందుకు ప్లాన్ చేస్తు్న్నారు.

ఈ నిర్మాణ పనులను మీనాక్షీ కన్‌స్ట్రక్షన్స్‌కు అప్పగించారట సురేష్ బాబు.సినిమా రంగానికి అనేక సేవలు అందించిన ఈ రామానాయడు స్టూడియో కనుమరుగవుతుందనే వార్త ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.

తాజా వార్తలు

Ramanaidu Studio To Be Shut Down-ramanaidu Studio,suresh Babu,telugu Movie News,venkatesh Related....