రమణదీక్షితులు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా ..?  

అటు టీటీడీకి ఇటు టీడీపీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న మాజీ టీటీడీ ప్రధానార్చకులు రమణదీక్షితులు రాజకీయాల్లోకి అదునుపెట్టబోతున్నారా .? అందుకే ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతోపాటు రాజకీయనాయకులవలె సవాల్ విసురుతూ కవ్వింపు చర్యలకు దిగుతున్నాడా అనే అనుమానాలు ఇప్పుడు ప్రతి ఒక్కరిలోనూ కలుగుతోంది...

రమణదీక్షితులు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా ..? -

ఆయన్ను ఎదో ఒక రాజకీయ పార్టీ వెనుక ఉంది నడిపిస్తోందన్న అనుమానాల్లోంచి ఆయనే రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నాడు అనే స్థాయికి ఆయన వ్యవహారం వెళ్లిపోయింది.

తన రాజకీయ అడ్డాగా టీటీడీ ని మార్చుకుని తెలుగుదేశం ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదం అయ్యాయి. అంతేకాకుండా ఈ వివాదం మరింత ముదిరి బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ద్వారా సుప్రీం కోర్టులో కూడా అడుగెట్టబోతోంది. అంతేకాదు టీటీడీ మీద ప్రభుత్వ పెత్తనానికి ముగింపుపలికే దిశగా వ్యవహారం వెళ్ళింది.

టీడీపీకి కొరకరాని కొయ్యగా మారిన రమణ దీక్షితులు సహజంగానే ప్రతిపక్ష వైసీపీకి ఆప్తమిత్రులయ్యారు..

“నామీద ఆరోపణలు చేసేవాళ్ళందరూ వాళ్ళవాళ్ళ ఆస్తుల మీద సీబీఐ దర్యాప్తునకు సిద్ధంగా ఉన్నారా. నన్ను ఎలిమినేట్ చేసే కుట్రలు జరుగుతున్నాయి.

నాకు ప్రాణహాని వుంది.” లాంటి ఆరోపణల్లో పక్కా రాజకీయ వాసనలు ఉండడంతో. ఆయన క్రమంగా రాజకీయ నాయకుడిలా మారుతున్నాడు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.

అంతే కాదు రమణదీక్షితులు వివాదాన్ని ప్రతిపక్ష పార్టీ కి చెందిన మీడియా లో పడే పడే చూపిస్తూ ప్రభుత్వం మీద కక్ష తీర్చుకుంటున్నారు.

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరో అడుగు ముందుకు వేసి “చంద్రబాబు ఇంట్లో దేవుడి నగలున్నాయి. సోదాలు చెయ్యండి” అంటూ సవాల్ చేసేదాకా వెళ్లారు.

చంద్రబాబు సైతం ప్రతీ బహిరంగసభలోనూ దీక్షితులు పేరును పడే పడే జపిస్తుండడంతో దీక్షితులుకు ప్రచారం బాగా వచ్చేసింది. అందుకే రమణ దీక్షితులుకు నైతిక మద్దతునిస్తూ.

వెన్నుదన్నుగా నిలబడాలని వైసీపీ భావిస్తున్నట్టు సమాచారం. దీనివల్ల ఏపీలో 3 సైతం ఉన్న బ్రాహ్మణుల ఓట్లు గంపగుత్తగా కొట్టేయవచ్చని వైసీపీ ఎత్తులు వేస్తోంది. రానున్న రోజుల్లో రమణదీక్షితులు వైసీపీ వైపు మద్దతుగా నిలబడినా ఆశ్చర్యపోనక్కర్లేదు.