టీఆర్ఎస్ లో చేరిన రామగుండం ఎమ్యెల్యే !     2019-01-07   20:25:37  IST  Sai Mallula

రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ టీఆర్ఎస్‌లో చేరారు. సోమవారం సాయంత్రం తెలంగాణ భవన్‌లో.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు. చందర్‌కు గులాబీ కండువా కప్పి కేటీఆర్ పార్టీలోకి ఆహ్వానం పలికారు. ఎమ్మెల్యేతో పాటూ పలువురు అనుచరులు కూడా టీఆర్ఎస్ పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా.. చంద్రం మాట్లాడుతూ… తిరిగి తన సొంత గూటికి రావడం ఆనందంగా ఉందన్నారు.

Ramagundam Mla Joining Trs Party-

Ramagundam Mla Joining Trs Party

కేటీఆర్ మాట్లాడుతూ… చందర్ టీఆర్ఎస్ లోకి చేరడం చాలా శుభపరిణామం అన్నారు. రామగుండం అభివృద్ధికి అందరం కలిసి పనిచేద్దామని.. రామగుండంలో మెడికల్ కాలేజ్, మైనింగ్ కాలేజ్ ఏర్పాటు చేస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో రామగుండం నుంచి లక్ష ఓట్లు టీఆర్ఎస్‌కు పడాలని పిలుపునిచ్చారు. ఇక మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ సేవలను పార్టీ అన్నిరకాలుగా… వినియోగించుకుంటుందన్నారు.