RRR అంటే రామ్ చరణ్, తారక్ రామ్, రాజమౌళి కాదంట.! మరేంటో తెలుసా.? జక్కన్న ఇచ్చిన క్లూ ఇదే.!

ప్రపంచవ్యాప్తంగా ఘన విజయం సాధించిన ‘బాహుబలి’ తర్వాత దర్శకుడు రాజమౌళి తెరకెక్కించే సినిమా అంటే ఎక్సపెక్టేషన్స్ ఎలా ఉంటాయో మనకు తెలియంది కాదు.అందుకు తగినట్టుగానే ‘RRR’ (వర్కింగ్‌ టైటిల్‌) అంటూ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లతో రాజమౌళి ఓ మల్టీస్టారర్‌ను తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు.

 Rama Ravana Rajyam Is This The Title For Rrr-TeluguStop.com

నవంబరు 11న ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభం అయ్యింది.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రభాస్‌ , చిరంజీవి ముఖ్య అతిథిలుగా వచ్చారు.

అయితే జక్కన్న సినిమా అంటే షూటింగ్ కొన్ని సంవత్సరాలు పడుతుంది అని అందరికి తెలిసిందే.ఈ సినిమాకి కోసం ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలో అనే సందేహం తెలుగు సినిమా అభిమానుల్లో కలిగింది.అయితే ఇక్కడే ఒక చిన్న క్లూ ఉంది.సినిమా మినిమం రెండేళ్లు పైగా పట్టేటట్లు ఉందని తెలిస్తోంది.ఆ క్లూ ఏమిటీ అంటే…ఈ చిత్ర షూటింగ్ కోసం హైదరాబాద్ లో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీని రాజమౌళి మూడేళ్ల పాటు లీజ్‌కు తీసుకున్నారని సమాచారం.

అంతేకాదు ‘RRR’ (వర్కింగ్‌ టైటిల్‌) అంటే అందరూ అనుకుంటున్నట్లు రాజమౌళి, రామారావు, రామ్‌చరణ్‌ మాత్రమే కాదని అంటున్నారు సినీ వర్గాలు.అదేమిటంటే…‘రామ రావణ రాజ్యం’.అయితే, దీనిపై దర్శక,నిర్మాతల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు.

డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డీవీవీ దానయ్య ‘RRR’ నిర్మిస్తున్నారు.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సంభందించిన .మిగిలిన నటీనటులు, చిత్రయూనిట్ వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube