రెమ్యునరేషన్ పెంచేసిన రామ్.. అన్ని కోట్లు తీసుకుంటున్నారా..?

ఇస్మార్ట్ శంకర్, రెడ్ సినిమాలతో టాలెంటెడ్ హీరో రామ్ వరుస విజయాలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఈ హీరో లింగుస్వామి డైరెక్షన్ లో ఒక సినిమాకు ఓకే చెప్పగా అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన కథలో రామ్ నటిస్తున్నారని ప్రచారం జరుగుతుండటం గమనార్హం.

 Ram Who Changed The Root Did He Also Increase The Rate-TeluguStop.com

అయితే రామ్ తన పారితోషికాన్ని భారీగా పెంచేసినట్లు తెలుస్తోంది.టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రస్తుతం 50 కోట్లకు అటూఇటుగా రికార్డు స్థాయిలో పారితోషికం తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

రామ్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 10కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నారని సమాచారం.రామ్ సినిమాలకు తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా బాగానే క్రేజ్ ఉంది.హిందీలో డబ్బింగ్ అయిన రామ్ సినిమాలు అక్కడ రికార్డు స్థాయిలో వ్యూస్ ను సొంతం చేసుకుంటున్నాయి.త్వరలో పాన్ ఇండియా డైరెక్టర్ మురుగదాస్ రామ్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుందని సోషల్, వెబ్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

 Ram Who Changed The Root Did He Also Increase The Rate-రెమ్యునరేషన్ పెంచేసిన రామ్.. అన్ని కోట్లు తీసుకుంటున్నారా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రామ్ లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా తెలుగుతో పాటు తమిళంలో కూడా తెరకెక్కనుండగా రామ్ సినిమాల శాటిలైట్, డిజిటల్ హక్కులకు భారీగా డిమాండ్ నెలకొంది.ఈ కారణాల వల్లే రామ్ తన రెమ్యునరేషన్ ను భారీగా పెంచేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

రామ్ కు జోడీగా కృతిశెట్టి ఈ సినిమాలో నటిస్తున్నారని సమాచారం.రామ్ ప్రస్తుతం తన మార్కెట్ ను పెంచుకునే పనిలో పడ్డారని తెలుస్తోంది.

Telugu 10 Crore Rupees, Hero Ram, Linguswamy Movie, Murugadoss, Remuneration-Movie

రామ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు హిట్టైతే రామ్ రెమ్యునరేషన్ మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.మల్టీ లాంగ్వేజ్ మూవీస్ చేయాలనే రామ్ ఆలోచన సక్సెస్ అయితే రామ్ దారిలో మరి కొందరు హీరోలు కూడా ఈ తరహా సినిమాలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి.

#Hero Ram #Remuneration #Murugadoss #10 Crore Rupees

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు