రాజమౌళికి రెడ్ లింక్ పెట్టిన రామ్  

Ram Waiting For Red Than Rajamouli - Telugu Rajamouli, Ram, Red Movie, Rrr

టాలీవుడ్‌ దర్శకధీరుడు రాజమౌళితో సినిమా చేయాలని చాలా మంది స్టార్ హీరోలు సైతం క్యూ కడుతుంటారు.బాహుబలి చిత్రంతో తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుడిగా రాజమౌళి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.

 Ram Waiting For Red Than Rajamouli

ఇలాంటి డైరెక్టర్‌తో ఒక్క సినిమానైనా చేయాలని స్టార్ హీరోలు కోరుకుంటున్నారు.అయితే రాజమౌళి నెక్ట్స్ సినిమా ఓ యంగ్ హీరోతో ఉండనుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ హీరో మాత్రం రాజమౌళిని వెయిట్ చేయాల్సిందే అంటున్నాడు.

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ఇటీవల ఇస్మార్ట్ శంకర్ సినిమాతో అదిరిపోయే హిట్ అందుకున్నాడు.ఇక ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో తన నెక్ట్స్ మూవీ ‘రెడ్’ను ఇప్పటికే రెడీ చేస్తున్నాడు ఈ హీరో.

రాజమౌళికి రెడ్ లింక్ పెట్టిన రామ్-Gossips-Telugu Tollywood Photo Image

అయితే రాజమౌళి తన నెక్ట్స్ మూవీ తనతో చేస్తాడో లేదో తెలియదు కానీ, ప్రస్తుతం తనకు రెడ్ చిత్రం మాత్రమే ముఖ్యమని రామ్ కుండబద్ధలు కొట్టాడు.

రెడ్ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఏ డైరెక్టర్ అయినా వెయిట్ చేయాల్సిందే అంటున్నాడు రామ్.

కిషోర్ తిరుమల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో రామ్ డ్యుయెల్ రోల్ చేస్తున్నాడు.మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో, రామ్ తన నెక్ట్స్ మూవీని ఎవరితో చేస్తాడో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ram Waiting For Red Than Rajamouli Related Telugu News,Photos/Pics,Images..