దర్శకుడు మారుతి, ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ చేతుల మీదుగా రామ్ వర్సెస్ రావణ్ సినిమా షూటింగ్ ప్రారంభం

సొలమన్ జడ్సన్, రాజ్ బాలా, మనో చిత్ర, అనన్య మణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “రామ్ వర్సెస్ రావణ్” . ఈ చిత్రంలో సప్తగిరి మరో కీలక పాత్రలో నటిస్తున్నారు.

 Ram Vs Rawan Shooting Started By The Hands Of Director Maruthi And Fight Masters Ram Lakshman-TeluguStop.com

కె శుక్రన్ దర్శకత్వం వహిస్తున్నారు.షాన ప్రొడక్షన్స్ పతాకంపై డాక్టర్ ఏఎస్ జడ్సన్ “రామ్ వర్సెస్ రావణ్” చిత్రాన్ని నిర్మిస్తున్నారు.“రామ్ వర్సెస్ రావణ్” సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో వైభవంగా జరిగింది.దర్శకుడు మారుతి, ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్, నిర్మాత సింధూర పువ్వు కృష్ణారెడ్డి అతిథులుగా హాజరై చిత్ర బృందానికి బెస్ట్ విశెస్ తెలిపారు.

ఈ సందర్భంగా దర్శకుడు కె .శుక్రన్ మాట్లాడుతూ…నేను దర్శకత్వ శాఖలో రాజమౌళి గారి దగ్గర బాహుబలి సినిమాకు పనిచేశాను.అంతకముందు వైవీఎస్ చౌదరి, శ్రీనివాస రెడ్డి, ఎన్ శంకర్ గారి దగ్గర వర్క్ చేశాను.నాకు మొదట ఏంజెల్ సినిమాతో దర్శకుడిగా అవకాశం ఇచ్చింది సింధూర పువ్వు కృష్ణారెడ్డి గారు.

 Ram Vs Rawan Shooting Started By The Hands Of Director Maruthi And Fight Masters Ram Lakshman-దర్శకుడు మారుతి, ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ చేతుల మీదుగా రామ్ వర్సెస్ రావణ్ సినిమా షూటింగ్ ప్రారంభం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆయన నాకు దేవుడు లాంటి వారు.అలాగే నాకు సపోర్ట్ చేసిన మా దర్శకులు రాజమౌళి, వైవీఎస్ చౌదరి, శ్రీనివాస రెడ్డి, ఎన్ శంకర్ వీళ్లందరి వల్లే ఇవాళ నేను ఈ స్థాయిలో ఉన్నాను.

నా మిత్రుల సమక్షంలో సినిమా ప్రారంభోత్సవం జరగడం చాలా సంతోషంగా ఉంది.రామ్ వర్సెస్ రావణ్ విషయానికొస్తే…ఇదొక పల్లెటూరిలో జరిగే కథ.ఆ ఊరి మంచి కోసం ఇద్దరు యువకులు ఎలా పోరాటం చేశారు అనేది సినిమాలో చూపిస్తున్నాం.యాక్షన్ తో పాటు ఎంటర్ టైన్ మెంట్ కథలో కలిసి ఉంటుంది.

కథ మీద పూర్తి నమ్మకంతో సినిమా ప్రారంభించాం.కపటధారి లాంటి పెద్ద చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన నా మిత్రుడు రాజామతి ఈ కథ విని బాగా నచ్చి ముందు ఈ సినిమా కంప్లీట్ చేద్దామన్నారు.

ఏంజెల్ సినిమాను మించిన విజయం రామ్ వర్సెస్ రావణ్ సాధిస్తుందని పూర్తి నమ్మకంతో ఉన్నాం అన్నారు.

Telugu Annapoorna Studios, Director Maruthi, Director Shukran, Fight Masters Ram Lakshman, Hero Solomon Jadson, Heroien Manu, Producer As Jadson, Ram Vs Rawan Movie, Ram Vs Rawan Shooting, Sapthagiri, Shana Entertainments Banner, Tollywood-Movie

హీరో సొలమన్ జడ్సన్ మాట్లాడుతూ…రామ్ వర్సెస్ రావణ్ చిత్రంలో నేను రామ్ క్యారెక్టర్ చేస్తున్నాను.ఇదొక ఫెంటాస్టిక్ స్టోరి.మొత్తం పల్లెటూరిలో జరుగుతుంది.

ఒక పల్లెటూరిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, వాటిని పరిష్కరించేందుకు రామ్, రావణ్ అనే యువకులు ఏం చేశారు, ఎలా పోరాడారు అనేది కథ.నాకు దర్శకుడు శుక్రన్ గారు చెప్పిన కథలో కొన్ని అంశాలు బాగా నచ్చాయి.ఆయన సినిమాను అద్భుతంగా రూపొందిస్తారనే నమ్మకం మా యూనిట్ అందరిలో ఉంది.ఈ సినిమాలో ఎమోషనల్ ఎలిమెంట్స్ తో పాటు మంచి కామెడీ కూడా ఉంటుంది.రామ్ వర్సెస్ రావణ్ కంప్లీట్ ఎంటర్ టైనర్ అనుకోవచ్చు.త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, వీలైనంత త్వరగా సినిమాను మీ ముందుకు తీసుకొస్తాం అన్నారు.

రాజ్ బాలా మాట్లాడుతూ…నేను ఈ మూవీలో రావణ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను.దర్శకుడు శుక్రన్ గారు నాకు బాహుబలి టైమ్ నుంచి మంచి మిత్రులు.నన్ను హీరోగా చాలా సినిమాలకు రికమెండ్ చేశారు.

Telugu Annapoorna Studios, Director Maruthi, Director Shukran, Fight Masters Ram Lakshman, Hero Solomon Jadson, Heroien Manu, Producer As Jadson, Ram Vs Rawan Movie, Ram Vs Rawan Shooting, Sapthagiri, Shana Entertainments Banner, Tollywood-Movie

రామ్ వర్సెస్ రావణ్ లో మంచి క్యారెక్టర్ ఇచ్చారు.దర్శకుడు శుక్రన్ గారికి నా థాంక్స్ చెప్పుకుంటున్నాను.రామ్ వర్సెస్ రావణ్ సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది.

పల్లెటూరిలోని సెన్సిటివ్ ఇష్యూస్ ను మా డైరెక్టర్ గారు కథలో చూపిస్తున్నారు.సీరియస్ ఇష్యూస్ కథలో ఉన్నా, అవన్నీ ఎంటర్ టైనింగ్ గానే దర్శకుడు తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాలో పనిచేస్తున్న వాళ్లంతా చిత్ర పరిశ్రమలో అనుభవం ఉన్నవాళ్లే.నాకు ఈ మూవీ విజయం మీద పూర్తి నమ్మకం ఉంది.

మంచి ప్లానింగ్ తో సినిమాను కంప్లీట్ చేయబోతున్నాం.మాకు ఈ సినిమా అవకాశం ఇచ్చిన నిర్మాత డాక్టర్ ఏఎస్ జడ్సన్ గారికి చాలా థాంక్స్ అన్నారు.

హీరోయిన్ మనో చిత్ర మాట్లాడుతూ…నేను పదేళ్లుగా చిత్ర పరిశ్రమలో ఉన్నాను.తమిళ్ లో రెగ్యులర్ గా మూవీస్ చేస్తుంటాను.దర్శకుడు శుక్రన్ గారు నాకు రామ్ వర్సెస్ రావణ్ కథ చెప్పినప్పుడు చాలా బాగుందని అనిపించింది.ముందుగా నాకు ఈ చిత్ర టైటిల్ బాగా నచ్చింది.

ఈ టీమ్ తో ట్రావెల్ అవుతుంటే…ఒక సూపర్ హిట్ సినిమా చేసేందుకు గట్టి నమ్మకంతో ఉన్నట్లు అర్థమయ్యింది.నా వంతు ఎఫర్ట్స్ పెట్టి, రామ్ వర్సెస్ రావణ్ సినిమా మంచి హిట్ అయ్యేలా ప్రయత్నిస్తాను.

నాకీ అవకాశం ఇచ్చిన నిర్మాత డాక్టర్ ఏఎస్ జడ్సన్, దర్శకుడు కె శుక్రన్ గారికి థాంక్స్ అన్నారు.

నటీనటులు – సొలమన్ జడ్సన్, రాజ్ బాలా, మనో చిత్ర, అనన్య మణి, సప్తగిరి తదితరులు

సాంకేతిక నిపుణులు – సినిమాటోగ్రఫీ : రాజామతి, సంగీతం : వికాస్ బాడిశ, స్టంట్స్ : రామ్ లక్ష్మణ్, బి జె శ్రీధర్, బ్యానర్ : షాన ప్రొడక్షన్స్ , నిర్మాత : డాక్టర్ ఏఎస్ జడ్సన్, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం : కె శుక్రన్

.

#Sapthagiri #Shana #Rawan #Solomon Jadson #Rawan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు