నాలుగు నెలల్లో అయోధ్య రామమందిరం... స్పష్టం చేసిన అమిత్ షా

అయోధ్య రామ జన్మభూమి వివాదం దశాబ్దాలుగా హిందూ, ముస్లింల మధ్య ఎంత విధ్వంస కరమైన వాతావరణం సృష్టించిందో అందరికి తెలిసిందే.దశాబ్దాల పాటు సాగిన ఈ వివాదానికి సుప్రీం కోర్టు ఫుల్ స్టాప్ పెట్టింది.

 Ram Temple In Ayodhya Amith Shah-TeluguStop.com

అయోధ్యలో వివాదాస్పద స్థలం హిందువులకి చెందినదిగా తీర్పు చెప్పింది.ఇక ఆ ప్రాంతంలో రామమందిరం నిర్మాణం చేసుకొని, దానిని ఒక ట్రస్ట్ కి అప్పగించాలని కూడా సుప్రీం సూచించింది.

ఓ విధంగా చెప్పాలంటే ఈ అయోధ్య రామమందిరం తీర్పు దేశంలో హిందువులలో బీజేపీపై మరింత అభిమానం పెరిగేలా చేసింది.హిందుత్వ వాదంతోనే రాజకీయాలు చేస్తున్న ఆ పార్టీకి ఓ విధంగా ఇప్పుడు దేశంలో సనాతన హిందూ వాదుల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంది.

దీంతో బీజేపీ ప్రభుత్వం దీనిని ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నా జార్ఖండ్ లో కూడా ప్రచారానికి వాడుకుంటుంది.ఇప్పటికే ఆర్టికల్ 370 రద్దు చేసి కాశ్మీర్ స్వతంత్ర హక్కులు తొలగిస్తూ తీసుకున్న నిర్ణయం కూడా ఇప్పుడు బీజేపీకి సానుకూలమైన అంశంగానే మారింది.

ఇదిలా ఉంటే తాజాగా జార్ఖండ్ లో ఎన్నికల ప్రచారంలో ఉన్న హోం మంత్రి అమిత్ షా అయోధ్య రామ మందిరం గురించి ఒక స్పష్టమైన అభిప్రాయం తెలియజేసారు.నాలుగు నెలల్లో రామమందిరం నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

దీని కోసం ఇప్పటికే ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని, దేశంలోనే అతిపెద్ద రామమందిరం నిర్మాణం అయోధ్యలో జరుగుతుందని చెప్పారు.ఒకప్పుడు అక్కడ ఎలాంటి రూపంలో రామమందిరం ఉండేదో అదే రూపంలో నిర్మాణం చేయబోతున్నట్లు తెలిపారు.

రామమందిరం నిర్మాణం చేయడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదని, ఎలాగైనా దానిని ఆపాలని చూస్తుందని అమిత్ షా విమర్శించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube