రొమాంటిక్ లో రామ్ సర్ ప్రైజ్ ఎంట్రీ..!

పూరీ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా కేతిక శర్మ హీరోయిన్ గా నటించిన సినిమా రొమాంటిక్.పూరీ కథ, మాటలు అందించిన ఈ సినిమాను అనీల్ పాదూరి డైరెక్ట్ చేశాడు.

 Ram Surprise In Akash Puri Romantic, Ram Surpris , Akash Puri , Romantic , Tolly-TeluguStop.com

పూరీ, ఛార్మీ కలిసి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది.ఇప్పటికే రెండు ట్రైలర్స్ తో సినిమాపై సూపర్ బజ్ ఏర్పరచిన రొమాంటిక్ సినిమాలో థియేటర్ లో మరో సర్ ప్రైజ్ ఉండబోతుందని తెలుస్తుంది.

అదేంటి అంటే సినిమాలో ఒక సాంగ్ లో ఇస్మార్ట్ శంకర్ రామ్ కనిపిస్తాడని టాక్.

రామ్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో ఇస్మార్ట్ శంకర్ సినిమా సూపర్ హిట్ అయ్యింది.

ఆ కృతజ్ఞతతో రొమాంటిక్ సినిమాలో రామ్ ఒక సాంగ్ లో అలా వచ్చి ఇలా వెళ్లాడని తెలుస్తుంది.ఆకాష్ పూరీ సినిమాలో ఇస్మార్ట్ రామ్ ఉన్నాడన్నది వస్తున్న వార్త.

మరి ఇందులో ఎంత నిజం ఉంది అన్నది శుక్రవారం బొమ్మ పడ్డాక అందరికి తెలుస్తుంది.రొమాంటిక్ సినిమాలో కేతిక శర్మ అందాలు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తాయని అంటున్నారు.

టీజర్, ట్రైలర్ లో ఆకాష్ పూరీతో పాటుగా ఆమెని కూడా చూసి ఇష్టపడ్డ ఆడియెన్స్ ఉన్నారని చెప్పొచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube