బోయపాటి బర్త్ డే వేడుకలలో సందడి చేసిన రామ్.. శ్రీలీలా... వైరల్ అవుతున్న ఫోటోలు!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ యాక్షన్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నటువంటి వారిలో డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) ఒకరు.ఈయన ఇండస్ట్రీలో దాదాపు 18 సంవత్సరాలుగా డైరెక్టర్ గా కొనసాగుతూ ఎన్నో అద్భుతమైన సూపర్ హిట్ సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేశారు.

 Ram Srileela Made Noise At Boyapatis Birthday Celebrations Photos Going Viral, B-TeluguStop.com

మాస్ యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన బోయపాటి తాజాగా బాలకృష్ణ (Balakrishna) హీరోగా నటించిన అఖండ సినిమా ద్వారా ఎంతో మంచిది సక్సెస్ అందుకున్నారు.ఇక ప్రస్తుతం ఈయన రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా ఓ సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఇకపోతే బోయపాటి శ్రీను ఏప్రిల్ 25వ తేదీ 1970 గుంటూరు జిల్లా పెదకాకానిలో జన్మించారు.అయితే తాజాగా ఏప్రిల్ 25వ తేదీన పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు.ఈ పుట్టినరోజు వేడుకలలో భాగంగా ప్రస్తుతం ఆయన చేస్తున్న చిత్ర బృందం పెద్ద ఎత్తున పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు.ఇలా ఈ పుట్టినరోజు వేడుకలలో భాగంగా సీనియర్ హీరో శ్రీకాంత్(Sreekanth), యంగ్ హీరో రామ్, యంగ్ బ్యూటీ శ్రీ లీల(Sreeleela) ఇతర చిత్ర బృందం పాల్గొని బోయపాటి చేత కేక్ కట్ చేయించి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ప్రస్తుతం బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.ఇక బోయపాటి శీను రామ్ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటుంది.ఈ సినిమాలో రామ్ సరసన శ్రీ లీల నటిస్తున్నారు.ఇక ఈ చిత్రాన్ని సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.ఈ సినిమా అక్టోబర్ 20వ తేదీ విడుదలకు సిద్ధమవుతుంది.ఇక రామ్ ది వారియర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

అయితే ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో బోయపాటి సినిమా పైనే ఆశలన్నీ పెంచుకున్నారు.మరి ఈ సినిమా తనని బయటపడేస్తుందో లేదో వేచి చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube