సంక్రాంతి బరిలో రెడ్ మూవీ… కన్ఫర్మ్ చేసిన హీరో రామ్  

Ram Red Movie Will Be Release In Sankranthi, Tollywood, Telugu Cinema, Lockdown, Kishore Tirumala, Hero Ram - Telugu Hero Ram, Kishore Tirumala, Lockdown, Red Movie, Sankranthi, Telugu Cinema, Tollywood

ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో కెరియర్ లో చాలా కాలం తర్వాత సాలిడ్ హిట్ కొట్టాడు.ఆ సినిమాలోని రామ్ ఎనర్జీ మొత్తాన్ని ఉపయోగించుకున్న దర్శకుడు పూరి ఒక రేంజ్ లో తెరపై అతనిని ఆవిష్కరించాడు.

TeluguStop.com - Ram Red Movie Will Be Release In Sankranthi

ఇప్పుడు మరోసారి డిఫరెంట్ గా రామ్ కెరియర్ లో‌ తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.ఒకటి మాస్ రోల్ కాగా మరొకటి క్లాస్ రోల్.

రెడ్ టైటిల్ తో కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది.స్రవంతి రవికిషోర్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు.

TeluguStop.com - సంక్రాంతి బరిలో రెడ్ మూవీ… కన్ఫర్మ్ చేసిన హీరో రామ్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

లాక్ డౌన్ కి ముందే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ వాయిదా పడిపోయింది.అయితే ప్రస్తుతం రిలీజ్ చేద్దామన్నా పరిస్థితి అంత అనుకూలంగా లేదు.

దీంతో ఒటీటీ రిలీజ్ చేస్తారని అందరూ భావించారు.అయితే ఇప్పుడు రామ్ నేరుగా ఈ సినిమాని సంక్రాంతి బరిలో తీసుకొచ్చేందుకు రెడీ అయ్యాడు.

వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ‘రెడ్‌’ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు రామ్‌ తన ట్విట్టర్‌ ద్వారా తెలిపారు.సంక్రాంతికి తన రెడ్‌ సినిమాను థియేటర్స్‌లోనే విడుదల చేయబోతున్నామంటూ రామ్‌ అధికారికంగా ప్రకటించారు.

దేవదాస్‌, మస్కా చిత్రాల తర్వాత మరోసారి తన సినిమా సంక్రాంతికి విడుదలవుతున్న చిత్రమిదే అంటూ రామ్‌ తెలిపారు.మాళవికా శర్మ, అమృతా అయ్యర్‌, నివేదా పేతురాజ్‌ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.

తమిళ్ హిట్ మూవీకి రీమేక్ గా తెరకెక్కిన ఈ రెడ్ సినిమాతో మరో సాలిడ్ హిట్ ని తన ఖాతాలో వేసుకోవాలని రామ్ చేస్తున్నాడు.అయితే ఈ రెడ్ సినిమాకి క్రాక్ సినిమాతో రవితేజ, వకీల్ సాబ్ తో పవన్ కళ్యాణ్ పోటీగా వస్తున్నారు.

వారిని తట్టుకొని ఎలా నిలబడతాడు అనేది చూడాలి.

#Lockdown #Sankranthi #Hero Ram

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ram Red Movie Will Be Release In Sankranthi Related Telugu News,Photos/Pics,Images..