నాని బాటలో రామ్.. మంగళం పాడేసిన ఓటీటీ!

ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా సినిమా థియేటర్లు మూతపడటంతో ఓటీటీలకు ఎలాంటి క్రేజ్ ఏర్పడిందో అందరికీ తెలిసిందే.ఇప్పటికే పలు సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యి అదిరిపోయే క్రేజ్‌ను దక్కించుకుంటున్నాయి.

 Ram Red Movie To Release On Amazon Prime, Ram Pothineni, Red, Amazon Prime, Toll-TeluguStop.com

అటు నిర్మాతలకు కూడా మంచి లాభాలను తెచ్చిపెడుతున్న ఓటీటీల్లో తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు స్టార్ హీరోలు, బడా నిర్మాతలు కూడా రెడీ అవుతున్నారు.ఈ క్రమంలో తాజాగా ఓటీటీలో నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘వి’ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

ఇప్పటికే ప్రముఖ ఓటీటీతో దిల్ రాజు ఒప్పందం కూడా చేసుకున్నాడని తెలుస్తోంది.త్వరలోనే ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

ఇక ఇప్పుడు నాని బాటలో మరో యంగ్ హీరో వెళ్లేందుకు రెడీ అవుతున్నాడు.యంగ్ అండ్ ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన ‘రెడ్’ చిత్రాన్ని వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యారు.

కానీ థియేటర్లు ఇప్పట్లో తెరుచుకునే పరిస్థితి లేకపోవడంతో ఈ సినిమాను కూడా ఓటీటీలో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

కాగా తాజాగా అమెజాన్ ప్రైమ్‌తో రెడ్ చిత్ర యూనిట్ ఒప్పందం చేసుకుందని, త్వరలోనే ఈ సినిమాను ఆన్‌లైన్‌లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

మొత్తానికి థియేటర్లు మూతపడటంతో ఇప్పుడు అందరూ కూడా ఓటీటీలో తమ సినిమాలను రిలీజ్ చేయాలని చూస్తున్నారు.ఈ క్రమంలోనే మరో యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన సోలో బ్రతుకే సో బెటర్ కూడా ఇదే దారిలో వెళ్తోంది.

మరి రెడ్ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube