రెడ్ మూవీ టీజర్ డేట్ ఫిక్స్! రెండు రోజుల్లో రానున్న రామ్

ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత హీరో రామ్ మళ్ళీ క్లాస్ చిత్రాల దర్శకుడు కిషోర్ తిరుమలతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ దర్శకుడు తన గత సినిమాల తరహాలో కాకుండా ఈ సారి రామ్ లో కాస్తా మాస్ యాంగిల్ లో చూపించే ప్రయత్నం చేస్తున్నాడు.

 Ram Red Movie Teaser Date Fix-TeluguStop.com

ఈ సినిమా రెడ్ టైటిల్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన ఓ పాటని డోలమైట్స్ ప్రాంతంలో సముద్రతీరానికి పదివేల అడుగుల ఎత్తుల మైనస్ ఐదు డిగ్రీల చలిలో చిత్రీకరిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబందించిన టీజర్ రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది.దీనికి తాజాగా డేట్ కూడా ఫిక్స్ చేశారు.ఫిబ్రవరి 28న సాయంత్రం ఐదు గంటలకి ఈ సినిమాకి సంబందించిన టీజర్ రిలీజ్ చేయబోతున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు.ఇక ఈ సినిమాలో నివేదా పేతురాజ్ మాళవిక శర్మ, అమృత అయ్యర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఇందులో రామ్ కెరియర్ లో మొదటిసారి ద్విపాత్రాభినయం చేస్తున్నారు.ఇక ఏప్రిల్ 9న ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది.

ఇస్మార్ట్ శంకర్ తో జోష్ మీద ఉన్న రామ్ మళ్ళీ ఈ సినిమాతో హిట్ కొడతాడేమో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube