రామ్ ‘రెడ్’ శాటిలైట్స్ రేట్స్‌కు అదిరిపోయే రేటు!  

Ram Red Movie Satellite Rights Sold For Bomb, Ram Pothineni, Red Movie, Satellite Rights, Kishore Tirumala, Tollywood News - Telugu Kishore Tirumala, Ram Pothineni, Ram Red Movie Satellite Rights Sold For Bomb, Red Movie, Satellite Rights, Tollywood News

యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రెడ్’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది.ఈ సినిమాతో మరోసారి ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్‌బస్టర్‌ను అందుకోవాలని రామ్ ప్రయత్నిస్తున్నాడు.

TeluguStop.com - Ram Red Movie Satellite Rights Sold For Bomb

కాగా థ్రిల్లర్ మూవీగా ఈ సినిమాను దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కిస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేయాలని రామ్ అండ్ టీమ్ భావించారు.

కానీ కరోనా కారణంగా సినిమా థియేటర్లు మూతపడటంతో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది.దీంతో ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తారని అందరూ అనుకున్నారు.

TeluguStop.com - రామ్ ‘రెడ్’ శాటిలైట్స్ రేట్స్‌కు అదిరిపోయే రేటు-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కానీ ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసే ప్రసక్తే లేదని చిత్ర యూనిట్ తెలిపింది.దీంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాగా ఈ సినిమాకు సంబంధించిన శాటిలైట్ రైట్స్‌కు అదిరిపోయే ఆఫర్ లభించినట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి.జెమిని టీవి ఛానల్ వారు రెడ్ చిత్రానికి సంబంధించిన శాటిలైట్ హక్కులను రూ.5 కోట్ల భారీ ఆఫర్ ఇచ్చి మరీ కొనుగోలు చేశారు.

ఈ సినిమాలో రామ్ డ్యుయెల్ రోల్‌లో నటిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.ఈ సినిమాలో రామ్ సరసన నివేథా పేతురాజ్, మాళవికా శర్మ, అమృత అయ్యర్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఈ సినిమాను స్రవంతి రవికిషోర్ ప్రొడ్యూస్ చేస్తుండగా మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో అదిరిపోయే బ్లాక్‌బస్టర్‌ను సొంతం చేసుకున్న రామ్, మరి రెడ్ చిత్రంతో తన సక్సెస్ ట్రాక్‌ను కంటిన్యూ చేస్తాడా లేడా అనేది ఆసక్తికరంగా మారింది.

#RamRed #Ram Pothineni

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ram Red Movie Satellite Rights Sold For Bomb Related Telugu News,Photos/Pics,Images..